AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలులో సీటు కోసం యువతి లొల్లి.. ప్రయాణీకుల ప్రాణాలతోనే ఆడుకుందిగా..

బస్సులు, లోకల్ రైళ్లలో సీట్ల కోసం తగాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మహిళలు సీట్ల కోసం ఎక్కువగా గొడవపడతారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు లోకల్ రైలులో సీటు కోసం తోటి ప్రయాణీకుడిపై పెప్పర్ స్ప్రే చల్లింది. ఈ చర్యతో ఇతర ప్రయాణీకులు కోపంతో ఆమెను తిడుతున్నారు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

రైలులో సీటు కోసం యువతి లొల్లి.. ప్రయాణీకుల ప్రాణాలతోనే ఆడుకుందిగా..
Woman Fight For A SeatImage Credit source: social media
Surya Kala
|

Updated on: Oct 13, 2025 | 9:11 PM

Share

బస్సులు , రైళ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమకు సీట్లు లభిస్తే చాలా సంతోషపడతారు. అలా సీటు దొరకాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు రద్దీ కారణంగా వారికి సీటు కూడా దొరకదు. అప్పుడప్పుడు సీటు కోసం ప్రయాణికులు గొడవ పడుతుంటారు. సాధారణంగా సీటు కోసం ప్రయాణీకుల మధ్య మాటల వాగ్వాదం జరుగుతుంది. లేదా ఈ సీటు నాది అని చెప్పి సీటులో టవల్ వేసి సీటు బుక్ చేసుకుంటారు. అయితే కోల్‌కతాలో ఒక వింత సంఘటన జరిగింది. ఒక మహిళ సీటు కోసం లోకల్ ట్రైన్ లో తోటి ప్రయాణీకురాలిపై పెప్పర్ స్ప్రే చల్లింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీటు కోసం ప్రయాణీకుడిపై పెప్పర్ స్ప్రే చల్లిన మహిళ కోల్‌కతాలోని లోకల్ ట్రైన్ లో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ సీటు కోసం లోకల్ రైలులో తోటి అమ్మాయిపై పెప్పర్ స్ప్రే చల్లింది. కోపంతో ఉన్న ఇతర ప్రయాణికులు ఆమెను కొట్టారు.

ఇవి కూడా చదవండి

అమృతా జిలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసి .. “ఈ ఆకుపచ్చ కుర్తీ ధరించిన మహిళ సీల్దా స్టేషన్‌లో రైలులో సీటులో కూర్చున్న అమ్మాయితో గొడవపడి ఆమెపై పెప్పర్ స్ప్రే చేయడానికి ప్రయత్నించింది. పెప్పర్ స్ప్రే తీయబోతుండగా ఒక మహిళ ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పుడు..ఆమె కోపంతో మొత్తం కోచ్‌లో పెప్పర్ స్ప్రే ను జల్లింది . ఆమె చేసిన పని వలన మాకు అందరికీ దగ్గు మొదలైంది. తీవ్ర ఇబ్బంది పడ్డం.. అంతేకాదు కోచ్ లో ఇద్దరు పిల్లలు కూడా అనారోగ్యంతో ఉన్నారు. చివరకు ఆమెను రైల్వే పోలీసులకు అప్పగించారు. వ్యక్తిగత భద్రత కోసం పెప్పర్ స్ప్రే వాడాలి.. కానీ ఇలా కాదు. ఈ యువతి తప్పు చేసింది. నేరస్థురాలు అనే క్యాప్షన్ జత చేసింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి :

వైరల్ అవుతున్న ఒక వీడియోలో రైలులో స్ప్రే చేసిన ఒక యువతిని మరొక తోటి ప్రయాణీకురాలు ఇలా చేయడం కరెక్ట్ కాదు.. ఇక్కడ పిల్లలు ఉన్నారు.. ఇలా చేయడం ఎంతవరకు సరైనది” అని అరుస్తూ కనిపిస్తుంది.

సెప్టెంబర్ 26న షేర్ చేయబడిన ఈ వీడియో 5 లక్షలకు పైగా వ్యూస్ ని రకరకాల కామెంట్స్ ని సొంతం చేసుకుంది. ఒక వినియోగదారు దీనికి “కొంతమంది అమాయక ప్రజలపై దాడి చేయడానికి పెప్పర్ స్ప్రేను ఆయుధంగా దుర్వినియోగం చేస్తున్నారు” అని క్యాప్షన్ ఇచ్చారు. మరొక వినియోగదారుడు “భద్రత కోసం ఉద్దేశించిన వస్తువులను దుర్వినియోగం చేయడం ఎంతవరకు సరైనదో” అని అన్నారు. ఇంకా చాలా మంది ఆ యువతి చేసిన పనిని ఖండించారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..