AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: వామ్మో.. ఇదెక్కడి గొడవరా బాబు..జూకి వెళితే ఇలాంటివి కూడా జరగొచ్చు..! భద్రం బీ కేర్‌ఫుల్‌

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎన్నో రకాల జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని వీడియోలు మాత్రం చాలా ప్రమాదకరంగా, భయంకరంగా

Shocking Video: వామ్మో.. ఇదెక్కడి గొడవరా బాబు..జూకి వెళితే ఇలాంటివి కూడా జరగొచ్చు..! భద్రం బీ కేర్‌ఫుల్‌
Giraffe
Jyothi Gadda
|

Updated on: May 21, 2022 | 7:12 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎన్నో రకాల జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని వీడియోలు మాత్రం చాలా ప్రమాదకరంగా, భయంకరంగా కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు ఓ జిరాఫీకి సంబంధించిన ఓ పాత వీడియో ఇంటర్నెట్‌లో కొత్తగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్‌ అవుతారు. సాధారణంగా అడవుల్లోనే కాకుండా జంతు ప్రదర్శనశాలల్లో మీరు జిరాఫీలను చాలా చూసుంటారు. అయితే.. వాటికి సంబంధించిన సరదా సన్నివేశాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియా (social media) లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జిరాఫీ చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఇంతకీ అది ఏం చేసిందంటే…

సాధారణంగా ప్రజలు జూకి వెళ్లినప్పుడు అక్కడి జంతువులకు ఆహారం పెట్టడం అలవాటే. ముఖ్యంగా కోతులు, ఏనుగులు వంటివాటికి పిల్లలు ఇష్టంగా ఆహారం అందిస్తుంటారు. అయితే, ఇక్కడ ఓ పిల్లవాడు భారీ పొడవున్న జిరాఫీకి ఆహారం అందించాలనుకున్నాడు. అదే అతడికి పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. అమ్మనాన్నలు పక్కనుండగానే, ఆ జిరాఫీ ఆ పిల్లవాడిని ఏం చేసిందో చూస్తే భయపడిపోతారు..

అయితే, ఎంతో హుషారుగా జిరాఫీకి ఫుడ్‌ పెట్టాలని ముందుకు వచ్చాడు ఆ బాలుడు. గడ్డి చేతిలో పట్టుకుని జిరాఫీ నోటికి అందించాలనుకున్నాడు. పాపం వాడి ప్రయత్నం బెడిసికొట్టింది. గడ్డిమొక్కను ఆ బాలుడు తన చేతితో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మామూలుగానే జిరాఫీ ఆ మొక్కను నోట్లో పెట్టుకుని పైకి లాగడంతో పిల్లవాడు సైతం అమాంతం గాల్లోకి లేచాడు. ఆ పక్కనే ఉన్న తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమయ్యారు. పిల్లాడి కాళ్లు పట్టుకుని గట్టిగా లాగారు. దాంతో అతను కిందకు వచ్చాడు. జిరాఫీ చేసిన స్టంట్‌కు ఆ పిల్లవాడు ఎక్కడో ఎగిరి పడేవాడు. ఈ ఘటనతో బాలుడి పేరెంట్స్‌ తొలుత భయపడినా.. ఆ తరువాత జరిగింది తలచుకుని తెగ నవ్వుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు పదే పదే వీడియోను చూస్తూ భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.