Viral Video: వ్యక్తిని తరిమిన ఒంటే.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే పడి పడి నవ్వుతారు..!
Viral Video: మనుషుల జోలికి జంతువులు వెళ్లినా.. జంతువుల జోలికి మనిషి వెళ్లినా రిస్క్ మనిషికే అని మరోసారి..

Viral Video: మనుషుల జోలికి జంతువులు వెళ్లినా.. జంతువుల జోలికి మనిషి వెళ్లినా రిస్క్ మనిషికే అని మరోసారి నిరూపితమైంది. కుక్కలు మనుషుల వెంటపడటం చూసుంటారు.. క్రూర జంతువులు కూడా వెంటపడటం చూసుంటారు. కానీ, ఒంటే వెంటబడటం ఎప్పుడైనా చూశారా?. వాస్తవానికి ఇలాంటి సీన్‌లు కొన్ని సీరియస్ పరిణామాలకు దారితీస్తే.. మరికొన్ని నవ్వు తెప్పించేలా ఉంటాయి. కుక్కలు, క్రూర జంతువులే కాదు.. ఆఖరికి కోళ్లు, పిల్లులు కూడా మనుషులను భయపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఒంటె మనిషిని తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఆ వైరల్ వీడియో విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ వీడియోలో ఓ వ్యక్తి తన కారను పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేశాడు. అనంతరం కారు నుంచి దిగి బయటకు వచ్చాడు. అయితే, ఊహించని రీతిలో అతని వెనుక ఓ ఒంటె ఉంది. ఒక్కసారిగా ఒంటె కనిపిపంచడంతో ఆ వ్యక్తి హడలిపోయాడు. వెంటనే భయంతో పరుగు లంకించాడు. ఒంటే నుంచి తనను తాను కాపాడుకునేందుకు తెలివిగా కారుకు అటువైపు వెళ్లాడు. కానీ ఒంటే వదిలిపెడితేగా.. అతని వెంటే పరుగులు తీసింది. దాంతో చేసేది లేక ఆ వ్యక్తి కూడా కారు చుట్టూ పరుగులు తీశాడు. ఒంటే కూడా అతని వెంటే తిరిగింది. ఇక ఒంటె తనను వదలిపెట్టదని భావించిన ఆ వ్యక్తి.. కారు లోపలికి దూరాడు. వెంటనే కార్ డోర్ వేసేసుకున్నాడు. కానీ, ఒంటె మాత్రం అలాగే కారు చుట్టూ తిరుగుతూ ఉంది. అలా రెండు రౌండ్లు అతను లేకుండానే.. ఒంటే కారు చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం అతను లేడని గ్రహించి.. ముందుకు వెళ్లిపోయింది. కాగా, ఈ సీన్‌ను అంతా కొందరు వీడియో తీశారు. చాలా ఫన్నీగా ఉండటంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు సైతం కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఫన్నీ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 14 లక్షల మందికిపైగా వీక్షించారు. వేలాది లైక్స్ వచ్చాయి.
Viral Video:
Also read:
Covid Patient: కోవిడ్ సెంటర్‌లో పేషెంట్ విచిత్ర డిమాండ్… బిత్తరపోయిన వైద్యులు… ( video )