Viral Video: టర్బన్స్ సాయంతో ఇద్దరి ప్రాణాలు కాపాడిన సిక్కులు.. వీడియో చూస్తే మీరూ మెచ్చుకుంటారు
తమ మత విశ్వాసాలను కూడా లెక్కచేయకుండా కొందరు సిక్కు యువకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి జలపాతంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన ఘటన ఇది. కెనడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో..
తమ మత విశ్వాసాలను కూడా లెక్కచేయకుండా కొందరు సిక్కు యువకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి జలపాతంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ప్రాణాలతో కాపాడారు. కెనడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. సిక్కులు తమ టర్బన్(తలపాగా)ను అత్యంత పవిత్రంగా భావిస్తారు. బ్రిటీష్ కొలంబియాలోని గోల్డన్ ఇయర్స్ ప్రోవిన్షియల్ పార్క్ వద్ద కుల్జీందర్ కిండా తన నలుగురు స్నేహితులతో కలిసి పర్వతాధిరోహణకు వెళ్లారు. ఆ సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు రాతిపై నడుచుకుని వెళ్తూ కాలుజారి అక్కడ జలపాతంకు సమీపంలోని నీటి కొలనులో పడ్డారు. అది ప్రత్యక్షంగా చూసిన కుల్జీంచర్ కిండా, అతని స్నేహితులు షాక్‌కు గురైయ్యారు. వారిని ఎలా కాపాడాలో తెలియక కాసేపు ఆలోచించిన వారికి ఓ మంచి ఐడియా వచ్చింది. తమ మత విశ్వాసాలను సైతం కాసేపు పక్కనపెట్టి.. అందరి టర్బన్(తలపాగా)లను జతచేర్చి తాడులా చేశారు. దాన్ని నీటి కొలనులో చిక్కుకున్న వారికి వదిలారు. దాని సాయంతో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డారు.
సిక్కులు తమ టర్బెన్‌లను తాడుగా చేసుకుని కాపాడిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సిక్కులపై స్థానిక మీడియా ప్రశంసలు కురిపించాయి. అటు సోషల్ మీడియా వేదికగానూ వారికి అభినందనలు వెల్లువెత్తాయి. నీటి కొలనులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను కాపాడేందుకు ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేయాలని ముందుగా అనుకున్నట్లు కుల్జీందర్ కిండా తెలిపారు. అయితే అక్కడ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ పూర్తిగా లేకపోవడంతో ఐదుగురు కలిసి వారిని ఏదో ఒకలా కాపాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మరో మార్గం లేని పరిస్థితిలో తమ టర్బెన్(తలపాగా)ను ఒకటిగా జతచేర్చి తాడులా కట్టి వారిని కాపాడినట్లు వివరించారు. పెను ముప్పు నుంచి బయటపడ్డ ఇద్దరు వ్యక్తులు కుల్జీందర్, అతని స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదులు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇద్దరు వ్యక్తులకు టర్బన్ల సాయంతో కాపాడిన సిక్కులు.. వైరల్ వీడియో
మీపై ఎన్ని జోక్స్ ఉన్నా.. ఎదుటివారి ప్రాణాలు కాపాడేందుకు చూపిన తెగువ ప్రశంసనీయమంటూ ఓ నెటిజన్ కొనియాడాడు. మీరు రియల్ హీరోలు అంటూ మరో నటిజన్ ఈ వీడియోపై కామెంట్ చేశాడు. సిక్కులు తమ టర్బెన్ల సాయంతో ఇద్దరి ప్రాణాలు కాపాడిన ఘటన చాలా అరుదైన ఘటనగా పేర్కొన్న ఓ నెటిజన్.. గతంలో ఇలాంటి ఘటన గురించి తానెప్పుడూ వినలేదు.. చూడలేదని వ్యాఖ్యానించాడు.
Also Read..
Viral Video: పవర్ ఆఫ్ యునైటెడ్ ఫ్యామిలీ.. వరద ఉధృతి నుంచి గున్న ఏనుగు ఎలా బయటపడిందో చూడండి
Viral Video: డియోడ్రెంట్ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో