AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadka Tea Viral Video: ఓరి దేవుడో ఇదేం చాయ్‌ రా సామీ..! ఈ వింత టీ తయారీ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా  చాలా రోజుల పాటు ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలు తమ ఇళ్లలో లభించే వస్తువులతో మంచి మంచి, భిన్నమైన ఆహారాలు వండటం, తినటం అలవాటుగా చేసుకున్నారు. ఇప్పుడు ప్రయోగం పేరుతో ఏదైనా జరుగుతోంది. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి వెన్నతో టీని తయారు చేస్తున్నాడు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..

Tadka Tea Viral Video: ఓరి దేవుడో ఇదేం చాయ్‌ రా సామీ..! ఈ  వింత టీ తయారీ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Tadka Tea Viral
Jyothi Gadda
|

Updated on: Jan 20, 2024 | 11:53 AM

Share

ఉదయం నిద్రలేవగానే.. పొట్టలో కప్పు టీ పడనిదే పనులు మొదలు పెట్టని వారు చాలా మంది ఉంటారు..వేడీ చాయ్‌ ఒక కప్పు కడుపులో పడగానే..అమాంతంగా శక్తి వచ్చేసినట్టుగా ఫీలవుతుంటారు..అయితే, తేయాకులతో తయారైన టీ పొడితో చాయ్‌ తయారు చేస్తారు. ఇక కొంతమంది ఈ టీలో దాల్చిన చెక్కలు, యాలకులు, అల్లం, లవంగాలు వంటివి వేసుకొని తయారు చేసి తాగుతూ ఉంటారు. అయితే, మరికొంతమంది టీలో చాలా పరిపూర్ణత కోరుకుంటారు. దానికోసం ప్రజలు ప్రతిరోజూ ఏదో ఒక విధానంలో చాయ్‌ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు..అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు టీ ప్రియులైతే..ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో చెప్పండి..

ప్రస్తుత కాలాన్ని ఫుడ్ బ్లాగింగ్ యుగం అని పిలవడం తప్పు కాదు. ప్రతిరోజూ ఏదో ఒక వంటకంతో ప్రయోగాలు చేస్తుంటారు చాలా మంది.. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా  చాలా రోజుల పాటు ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలు తమ ఇళ్లలో లభించే వస్తువులతో మంచి మంచి, భిన్నమైన ఆహారాలు వండటం, తినటం అలవాటుగా చేసుకున్నారు. ఇప్పుడు ప్రయోగం పేరుతో ఏదైనా జరుగుతోంది. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి వెన్నతో టీని తయారు చేస్తున్నాడు..

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక పెద్దాయన టీ స్టాల్ వద్ద కూర్చుని టీ తయారు చేస్తుండటం కనిపించింది. టీ చేయడానికి, అతను ఒక కుండలో గులాబీ రేకులు, యాలకులు, అల్లం వేశాడు. ఇదంతా అతను ఒక రాజు లేదా చక్రవర్తి కోసం సిద్ధం చేసినట్లుగా టీ సిద్ధం చేశాడు.. చివరగా టీ తయారైంది.. ఇప్పుడు మరొక పాత్రలో వెన్న, బాదం, మరికొన్ని మసాలా దినుసులను వేసిపెట్టు్కున్నాడు. ఆ తర్వాత సిద్ధం చేసిన టీని చల్లబరుచుకున్నాడు..ఆ రెండిటీని కలిసి ఈ ప్రత్యేకమైన టీ సప్లై చేశాడు..

ఈ వీడియోను chatore_brothers అనే ఖాతా ద్వారా Instagramలో భాగస్వామ్యం చేసారు. దీన్ని చూసిన తర్వాత, వినియోగదారులు దానిపై వివిధ అభిప్రాయాలు, స్పందనను తెలియజేశారు. ఒక యూజర్ కోపంతో అన్నాడు – ఇప్పుడు దాల్ ఫ్రై మసాలా కూడా అందులో వేయండి. జీలకర్ర ఎక్కువ వేస్తే సరదాగా ఉండేదని మరో యూజర్ రాశారు. ఈ వీడియో అమృత్‌సర్‌లోని విక్కీ టీ స్టాల్ నుండి రిలీజ్‌ చేసినట్టుగా సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి