AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ ఐస్ క్రీమ్ కావాలంటే బిగ్గరగా అరిస్తే చాలు.. ఫ్రీగా ఐస్ క్రీమ్

మెషిన్ ముందు ఓ యువకుడు నిలబడి బిగ్గరగా కేకలు వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ప్రారంభంలో అతను మెల్లగా అరిచాడు. అప్పుడు కర్టెన్ కొద్దిగా పైకి లేస్తుంది.. కానీ అది క్రిందికి దిగిపాయింది.  అయితే క్రమంగా అతను తన అరుపుల పరిమాణాన్ని పెంచుతాడు.  తరువాత కర్టెన్ పైకి వెళ్లేంత బిగ్గరగా అరిచాడు. ఆ తర్వాత అతను ఉచిత ఐస్ క్రీం పొందే అర్హత పొందాడు.

అక్కడ ఐస్ క్రీమ్ కావాలంటే బిగ్గరగా అరిస్తే చాలు.. ఫ్రీగా ఐస్ క్రీమ్
Free Ice Cream
Surya Kala
|

Updated on: Jun 03, 2024 | 10:58 AM

Share

కొన్నిసార్లు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కొన్ని రకాల మార్కెటింగ్ వ్యూహాలను అవలంబిస్తాయి. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే  ఈ వీడియో చూస్తే బహుశా మీరు కూడా నమ్మలేరు. వేసవి వస్తే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఐస్ క్రీమ్ తినడాన్ని ఇష్టపడతారు. ఇందుకు డబ్బులు ఖర్చు చేయాల్సి  ఉంటుంది. అయితే బిగ్గరగా అరిస్తే ఉచిత ఐస్ క్రీమ్ దొరికితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. అవును  ఒక షాప్ లో ఒక యంత్రం అమర్చబడిన ప్రదేశం ఉంది. ఆ యంత్రం ముందు ఎవరైనా బిగ్గరగా అరిస్తే  ఐస్‌క్రీమ్ ఉచితంగా ఇస్తుంది. గట్టిగా అరిస్తే యంత్రం లోపల కర్టెన్ పైకి లేచి ఐస్ క్రీం ఉచితంగా లభిస్తుంది.

మెషిన్ ముందు ఓ యువకుడు నిలబడి బిగ్గరగా కేకలు వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ప్రారంభంలో అతను మెల్లగా అరిచాడు. అప్పుడు కర్టెన్ కొద్దిగా పైకి లేస్తుంది.. కానీ అది క్రిందికి దిగిపాయింది.  అయితే క్రమంగా అతను తన అరుపుల పరిమాణాన్ని పెంచుతాడు.  తరువాత కర్టెన్ పైకి వెళ్లేంత బిగ్గరగా అరిచాడు. ఆ తర్వాత అతను ఉచిత ఐస్ క్రీం పొందే అర్హత పొందాడు. దీని తర్వాత మరికొందరు కూడా అదే ప్రయత్నం చేశారు. వారు బిగ్గరగా అరుస్తూ ఐస్ క్రీం బహుమతిని గెలుచుకున్నారు. ఈ ప్రత్యేకమైన వీడియో సింగపూర్‌కి చెందినది అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ ప్రత్యేకమైన వీడియో @Rainmaker1973 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.  కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 28 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు మనిషి ప్రీగా వస్తుంది అంటే చాలు ఏమి చేయడానికైనా రెడీ అని కామెంట్ చేయగా.. చిన్న వస్తువు అయినా సరే ఉచితంగా లభిస్తే దేనికైనా సిద్ధంగా ఉంటాడు అని మరొకరు రాశారు, ‘ఉచిత ఐస్‌క్రీం పొందడం కోసం అరవడం కూడా మీ స్వర పేటిక తంతువులను పరీక్షించడానికి గొప్ప మార్గం’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..