Dog Heart Surgery: శునకానికి హార్ట్ సర్జరీ.. ఆసియాలోనే అరుదైన ఘటన.. భారతదేశంలోనే తొలిసారిగా..

రెండు రోజుల అనంతరం ఆ శునకాన్ని డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం ఆ కుక్కకు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి సర్జరీ చేయడం ఆసియాలోనే మొదటి సారి. ప్రపంచంలోనే రెండోదిగా వైద్యులు వెల్లడించారు. మిట్రల్ వాల్వ్ వ్యాధి భారతదేశంలో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కుక్కలలో అత్యంత సాధారణ గుండె జబ్బు. ఈ వ్యాధితో బాధపడుతున్న కుక్కలు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Dog Heart Surgery: శునకానికి హార్ట్ సర్జరీ.. ఆసియాలోనే అరుదైన ఘటన.. భారతదేశంలోనే తొలిసారిగా..
Dog Heart Surgery
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2024 | 11:25 AM

Dog Heart Surgery In Delhi : సంక్లిష్టమైన గుండె వ్యాధితో బాధపడుతున్న ఓ శునకానికి అరుదైన ఆపరేషన్‌ చేశారు ఢిల్లీలోని వెటర్నరీ వైద్యులు. భారతదేశంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుక్కకు ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని పశువైద్యులు పేర్కొంటున్నారు. జూలియట్ అనే 7 ఏళ్ల బీగల్ గత రెండేళ్లుగా మిట్రల్ వాల్వ్ వ్యాధితో బాధపడుతోందని వైద్యులు వెల్లడించారు. మిట్రల్ వాల్వ్‌లో మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది గుండె ఎడమ ఎగువ గదిలోకి రక్తం తిరిగి ప్రవహిస్తుంది. వ్యాధి తీవ్రమైతే, గుండె ఆగిపోవచ్చు. ఇలాంటి సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఆ కుక్కకు ఎలాంటి కోతలులేని గుండె సర్జరీ నిర్వహించారు.

సర్జన్లు మే 30న ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ గుండె సర్జీర చేశారు వైద్యులు. ఇది ఒక హైబ్రిడ్ సర్జరీ, ఇది మైక్రో సర్జరీ, సంప్రదాయ సర్జరీ మిళిత ప్రక్రియను అనుసరిస్తుంది. ఈ ప్రక్రియలో బెస్ట్‌ అప్షన్‌ ఇది చాలా తక్కువ ప్రమాదం కలిగి ఉంటుందని డాక్టర్ శర్మ వివరించారు. ఈ సమస్యతో బాధపడుతున్న జూలియట్‌కు ఢిల్లీలోని మ్యాక్స్‌ పెట్జ్‌ ఆసుపత్రి నిపుణులు, ట్రాన్స్‌కెథతర్‌ ఎడ్జ్‌-టు-ఎడ్జ్‌ రిపెయిర్‌ (టీఈఈఆర్‌) అనే ప్రక్రియ ద్వారా సర్జరీ చేశారు నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా రక్తనాళం గుండా ఒక సాధనాన్ని పంపి శస్త్రచికిత్స చేశారు. గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. గత నెల 30న ఈ శస్త్రచికిత్స జరిగింది.

రెండు రోజుల అనంతరం ఆ శునకాన్ని డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం ఆ కుక్కకు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి సర్జరీ చేయడం ఆసియాలోనే మొదటి సారి. ప్రపంచంలోనే రెండోదిగా వైద్యులు వెల్లడించారు. మిట్రల్ వాల్వ్ వ్యాధి భారతదేశంలో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కుక్కలలో అత్యంత సాధారణ గుండె జబ్బు. ఈ వ్యాధితో బాధపడుతున్న కుక్కలు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట