AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఈ బుడ్డోడు మహా ముదురు.. బాడీ బిల్డర్‌లా బిల్డప్‌ కొడుతున్నాడు..! కొబ్బరి కాయతో స్టంట్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే..

మే 16న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. చాలా మంది వీడియో చూసి ఇష్టపడుతున్నారు. వీడియోలో చిన్నారి చేసిన పని నిజంగానే విస్మయం కలిగిస్తోంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఫీట్ సాధించడం మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. వీడియోను చూసిన యూజర్లు దానికి రకరకాల రియాక్షన్స్ ఇస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వామ్మో ఈ బుడ్డోడు మహా ముదురు.. బాడీ బిల్డర్‌లా బిల్డప్‌ కొడుతున్నాడు..! కొబ్బరి కాయతో స్టంట్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే..
Boy Breaks Dry Coconut
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2024 | 10:27 AM

Share

ఇంటర్నెట్‌లో ఎప్పుడు ఏం కనిపిస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా, అలాంటి షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. వీడియోలో ఒక బాలుడు చేసిన స్టంట్‌ చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సి వస్తుంది. బుడ్డొడి ఫీట్ చూసి ఇప్పటికే నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. భిన్నమైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ వైరల్‌ వీడియోలో బుడ్డొడు ఏం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం…

షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక బాలుడు తన వెన్నులో రెండు ఎముకల మధ్య కొబ్బరికాయను పగులగొడుతున్నాడు. బాలుడి ఈ ఫీట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చిన్నారికి దాదాపు 10 నుంచి 12 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఆ బుడ్డొడు తన రెండు భూజాల మధ్య వెన్నుపై కొబ్బరికాయ పెట్టుకుని రెండు రెక్కలను వెనక్కి నెడుతూ.. కొబ్బరికాయను ముక్కలుగా చేశాడు. అంతేకాదు.. ఆ కొబ్బరికాయ ముక్కలుగా పగలగానే ఆ బాలుడు దాన్ని తింటూ కనిపించాడు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో aakumar1281 అనే వినియోగదారు షేర్ చేసారు. వీడియో వేగంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Aakash Kumar (@aakumar1281)

మే 16న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. చాలా మంది వీడియో చూసి ఇష్టపడుతున్నారు. వీడియోలో చిన్నారి చేసిన పని నిజంగానే విస్మయం కలిగిస్తోంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఫీట్ సాధించడం మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. వీడియోను చూసిన యూజర్లు దానికి రకరకాల రియాక్షన్స్ ఇస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…