AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇన్నోవేటివ్ వాష్ బేసిన్.. వెదురు బొంగులతో వినూత్న నిర్మాణం.. మంత్రి వీడియో షేర్..

ఈ నిర్మాణం చూడ్డానికి అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నా, లేకపోయినా.. సిరామిక్ ఫిట్టింగ్‌లకు ప్రత్యామ్నాయంగా గ్రామస్తులు చేసిన జుగాడ్ లాగా చాలా అందంగా ఉంది. పెద్ద లావు వెదురు బొంగుని ఏర్పాటు చేసి దానికి చిన్న చిన్న రంధ్రాలను ఏర్పాటు చేశారు. వాటికి క్యాప్స్ కూడా వేశారు. ఆ వెదురు బొంగు నుంచి నీరు ప్రవహిస్తుంది. నీరు వృధా కాకుండా ఉండటానికి చెక్క స్టాపర్‌తో ప్యాక్ చేయబడింది. 

Viral Video: ఇన్నోవేటివ్ వాష్ బేసిన్.. వెదురు బొంగులతో వినూత్న నిర్మాణం.. మంత్రి వీడియో షేర్..
Viral Video
Surya Kala
|

Updated on: Aug 15, 2023 | 9:33 AM

Share

నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలతో కామెంట్స్ తో సందడి చేస్తూనే ఉంటారు. ఓ వైపు తన రాష్ట్రాన్ని.. ప్రజలను అక్కడ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. సందర్భానుసారంగా వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. తాజాగా  మంత్రి టెమ్‌జెన్ ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఇది సహజమైన అందాలను తెలియజేస్తూ.. వాటిని తమ రాష్ట్ర ప్రజలు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలియజేసే రీబ్రాండ్ వీడియో. రాష్ట్రంలోని అనేక  గ్రామాల్లో వెదురుతో చేసిన పర్యావరణ అనుకూల వాష్‌బేసిన్‌లను సృష్టించి విషయం చూపిస్తుంది. ఈ వీడియో క్లిప్ లో ప్రకృతి ప్రసాదించే వాటిని నైపుణ్యంతో వస్తువులుగా మార్చి తద్వారా వినూత్న నిర్మాణానికి చెందింది.

ఇక్కడ ఉన్న వీడియోను చూడండి:

ఈ నిర్మాణం చూడ్డానికి అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నా, లేకపోయినా.. సిరామిక్ ఫిట్టింగ్‌లకు ప్రత్యామ్నాయంగా గ్రామస్తులు చేసిన జుగాడ్ లాగా చాలా అందంగా ఉంది. పెద్ద లావు వెదురు బొంగుని ఏర్పాటు చేసి దానికి చిన్న చిన్న రంధ్రాలను ఏర్పాటు చేశారు. వాటికి క్యాప్స్ కూడా వేశారు. ఆ వెదురు బొంగు నుంచి నీరు ప్రవహిస్తుంది. నీరు వృధా కాకుండా ఉండటానికి చెక్క స్టాపర్‌తో ప్యాక్ చేయబడింది.  అలాగే, చెక్క ముక్క టవర్ హ్యాంగర్‌గా పనిచేస్తుంది. వెదురుకు హ్యాండ్ వాష్ సొల్యూషన్స్‌ను తాళ్లు కట్టి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఆధునిక వాష్ బేసిన్ దగ్గర ఏ విధమైన ఏర్పాట్లు ఉంటాయో.. అదే విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. దేనిలోనూ రాజీపడలేదు.

ఈ వీడియోను ఆన్‌లైన్‌లో ట్వీట్ చేసిన మంత్రి.. ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటివి చూశారా అని అలాంగ్ క్యాప్షన్ ఇచ్చారు. “దేఖా హై కహీ ఐసా” అని రాశాడు.

ఇప్పుడు, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌లో ప్రజలు నాగాలాండ్‌లోని ప్రకృతి  వాష్‌బేసిన్‌ పట్ల ప్రశంసలు అందుకుంటుంది. ఒక రోజు వ్యవధిలో, ఈ ఫుటేజ్ 10,000 కంటే ఎక్కువ లైక్‌లను, దాదాపు రెండు లక్షల వీక్షణలను సొంతం చేసుకుంది. ఇది అద్భుతమైన ఆలోచన అని పేర్కొంటూ.. చాలా మంది నెటిజన్లు వీడియోకు ప్రత్యుత్తరంగా సంతోషకరమైన ఎమోజీలను షేర్ చేస్తున్నారు. బాగుంది ప్రకృతిని కాపాడేందుకు’’ అని ఓ నెటిజన్ చెప్పగా, ‘వావ్’ అని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..