Viral Video: గున్న ఏనుగును రక్షించుకునేందుకు నీటి కొలనులో మొసలితో తలపడిన తల్లి ఏనుగు.. చివరకు గెలిచిందెవరో ఊహించగలరా?
జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా నీటి కొలనులో మొసలితో ఓ ఏనుగు తలపడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా నీటి కొలనులో మొసలితో ఓ ఏనుగు తలపడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నీటిలో ఉన్నంత వరకు మొసలిని ఢీకొట్టడం మిగిలిన ఏ జంతువుకైనా కష్టమే. అందుకే నీటి కుంటల దగ్గర నీరు తాగేందుకు వచ్చే జంతువులపై మొసళ్లు అదునుచూసి మొరుపు దాడి చేస్తాయి. అమాంతం వాటిని నీటిలోకి లాక్కెళ్లిపోయి తమ కడుపు నింపుకుంటాయి. ఏనుగుల గుంపులో గున్న ఏనుగులను టార్గెట్ చేసి దాడి చేస్తుంటాయి.
జాంబియా సఫారీలోని నీటి కొలనులో ఓ మొసలి ఇలాగే తన కడుపునింపుకునేది. ఓ సారి కొన్ని ఏనుగులు గుంపుగా అక్కడ నీరు తాగేందుకు వెళ్లాయి. అదును కోసం వేచిచూసిన మొసలి.. గున్న ఏనుగుపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లేందుకు విఫలయత్నం చేసింది. అయితే గున్న ఏనుగు తృటిలో ఏనుగు దాడి నుంచి తప్పించుకుంది. దీంతో తల్లి ఏనుగు నీటి కుంటలోకి దిగి ఆ మొసలితో తలపడింది. భారీ దంతాలు లేకపోయినా తన తల, నోటితోనే మొసలిని అంతమొందించింది. జఫారీకి వెళ్లిన ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొసలితో ఏనుగు తలపడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నీటి కొలనులో మొసలితో తలపడిన ఏనుగు.. వీడియో
మొసలి బారి నుంచి గున్న ఏనుగును కాపాడుకునేందుకు తల్లి ఏనుగు చేసిన సాహసం అమోఘమంటూ నెటిజన్స్ కొనియాడుతున్నారు.
Also Read..
Crying Room: ఏడవడానికి మొహమాటం అవసరం లేదు.. మనసారా ఏడ్చేందుకు ప్రత్యేక గదులు.. ఎక్కడో తెలుసా?
Old World Monkey: రంగు రంగు దుస్తులను ధరించినట్లు కనిపించే కోతి.. ప్రత్యేకతలు ఏమిటంటే..