Viral Video: ఆవుదూడపై కొండచిలువ దాడి.. సాయం మరచి వీడియో తీస్తున్న వ్యక్తి.. మండిపడుతున్న నెటిజన్లు

Viral Video: పాములు(Snakes) అంటేనే భయం. పాముల పరిమాణం లేదా జాతితో సంబంధం లేకుండా.. విషం ఉన్న పాములైనా, విషం లేని పాములైనా సరే భయపడడం సర్వసాధారణం..

Viral Video: ఆవుదూడపై కొండచిలువ దాడి.. సాయం మరచి వీడియో తీస్తున్న వ్యక్తి.. మండిపడుతున్న నెటిజన్లు
Viral Video
Follow us

|

Updated on: Apr 20, 2022 | 12:43 PM

Viral Video: పాములు(Snakes) అంటేనే భయం. పాముల పరిమాణం లేదా జాతితో సంబంధం లేకుండా.. విషం ఉన్న పాములైనా, విషం లేని పాములైనా సరే భయపడడం సర్వసాధారణం. ఇటీవల ఈ పాములు, కొండచిలువలకు (python)  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి.  తాజాగా పొలంలో ఓ దూడపై భారీ కొండచిలువ దాడి చేసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆవుదూడను భారీ కొండ‌చిలువ మింగేందుకు ప్రయ‌త్నించింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో దాదాపు 10 అడుగుల పొడవున్న కొండచిలువ మొదట ఆవులున్న ఆవ‌ర‌ణ‌లోకి వచ్చింది. దీంతో ఆవుదూడ‌లు ప‌రుగెత్తడం ప్రారంభించాయి. అయితే, కొండచిలువ ఓ ఆవుదూడ కాలును ప‌ట్టేసుకుంది. కొండచిలువ పట్టు చాలా బలంగా ఉండడంతో దూడ విడిపించుకోలేకపోయింది. దూడ తప్పించుకోగలిగిందా? లేదా? అనేది తెలియ‌లేదు. అయితే ఆవుదూడ‌ను కాపాడ‌కుండా య‌జ‌మాని వీడియో ఎందుకు తీశాడ‌ంటూ నెటిజ‌న్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు. వీడియో చూస్తున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీలయితే ప్రమాదంలో ఉన్న మూగజీవులను కాపాడండి.. అంతేకానీ ఇలా వీడియోలు తీయండం కరెక్ట్‌ కాదంటున్నారు.

Also Read: Travel India: దేశంలో అందమైన సరస్సులు… ఇక్కడ పర్యటన ప్రకృతి ప్రేమికులకు అందమైన అనుభూతి..(Photo gallery)