Viral Video: వేగంగా దూసుకొస్తున్న కారు..ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం..వైరల్‌ ..వీడియో

Viral Video: సోష‌ల్‌మీడియాలో(Social Media) మనం ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అలాంటి వీడియోలు మనల్ని చాలా...

Viral Video: వేగంగా దూసుకొస్తున్న కారు..ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం..వైరల్‌ ..వీడియో
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 03, 2022 | 10:44 AM

Viral Video: సోష‌ల్‌మీడియాలో(Social Media) మనం ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అలాంటి వీడియోలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు.. ఒక్క క్షణం దీర్ఘంగా ఊపిరి తీసుకుంటారు. ఎందుకంటే ఈ వీడియోలో వేగంగా దూసుకెళ్లున్న కారును ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఎంతో చాకచక్యంగా ఆపి, పెను ప్రమాదాన్ని తప్పించాడు. ఆ వ్యక్తి సాహసం నెటిజన్లను కట్టిపడేస్తుంది. అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక నాలుగు రోడ్ల కూడలిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నిర్మాణుష్యంగా ఉంది. ఆ వీధిగుండా ఒక మ‌హిళ న‌డుచుకుంటూ వెళ్తుంది. ఆమె వెళ్లిపోగానే వెనుకే ఓ కారు అదుపుత‌ప్పి అతి వేగంగా ఓ ఇంటివైపు దూసుకెళ్తుంటుంది. ఈ విషయాన్నీ ఓ ఇద్దరు వ్యక్తులు ఎక్కడినుంచి గమనించారో కానీ.. వారిలో ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి ఒక్క ఉదుటన కారు విండోలోంచి లోపలికి దూకి.. హ్యాండ్‌ బ్రేక్ వేసాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.

సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం వల్ల కారు జీబ్రా క్రాసింగ్‌కు కొన్ని మీటర్ల ముందు, ఒక ఇంటి నుండి కొన్ని మీటర్ల దూరంలో ఆగిపోయింది. వాహనాన్ని ఆపిన తర్వాత, జెర్సీలో ఉన్న వ్యక్తి కారు ముందుకు కదలకుండా చూసేందుకు హ్యాండ్‌బ్రేక్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ, ప్రమాదం జరిగినప్పుడు రోడ్డుపై ఇతర వాహనాలు లేవు. ఈ క్లిప్ పోస్ట్ చేయడంతో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వ్యక్తి సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.. రకరకాల కామెంట్లతో ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Visakhapatnam: మొదలైన చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

 ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది.. అదెలాగో ఈ ఫోటోపై లుక్కేస్తే తెలుస్తుంది..!

Also Read: Palm Wine In Bamboo: వేసవి దాహార్తి తీర్చుకోవడానికి సరికొత్త పానకం. బొంగులో కల్లు కోసం బారులు తీరుతున్న జనం