Viral Video: మానవత్వం అంటే ఇదే.. నెటిజన్ల మనస్సు దోచుకుంటున్న బుడ్డోడు.. వీడియో వైరల్
Little Boy Viral Video: సోషల్ మీడియో ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నెటిజన్ల మనస్సు దోచుకుంటున్నాయి. కొన్ని వీడియోలు మనుషుల్లో దాగున్న మానవత్వం, ప్రేమను
Little Boy Viral Video: సోషల్ మీడియో ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నెటిజన్ల మనస్సు దోచుకుంటున్నాయి. కొన్ని వీడియోలు మనుషుల్లో దాగున్న మానవత్వం, ప్రేమను తట్టిలేపుతుంటాయి. అయితే.. సాధారణంగా మానవత్వమనేది అందరిలో దాగుంటుంది. కొంతమంది ఎలా వ్యక్తపరచాలో తెలియక వెనకడుగు వేస్తుంటారు. అయితే.. పిల్లలకు దయ, కరుణ లాంటివి తేలయకపోయినా.. వారు సాటివారిపై ఎంతో ప్రేమను కనబరుస్తుంటారు. దానికి ఉదాహరణే తాజాగా వైరల్ అవుతున్న వీడియో.. దాహంతో ఉన్న కుక్కకు నీళ్లు తాపిస్తున్న చిన్న పిల్లవాడిని చూసి నెటిజన్లంతా షాకవుతున్నారు. నిజంగా ఈ వీడియో తమ హృదయాలను కట్టిపడేస్తుందంటూ పేర్కొంటున్నారు. బుడ్డోడికి కుక్క మీదున్న ప్రేమను చూసి ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
వైరల్ వీడియోలో ఓ బోరు వద్ద కుక్క, చిన్న పిల్లవాడు కనిపిస్తుంటారు. అయితే.. కుక్కకు దాహం వేస్తుందని చిన్నోడు ఎలా గ్రహించాడో ఏమో కానీ.. దాని దాహం తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. బోరు వద్ద నిలబడి.. దాని నీరు వచ్చే కడ్డీ పట్టుకోని కోడుతుంటాడు. అయితే.. దాన్ని హ్యాండ్ పంప్‌ను ఆపరేట్ చేయడం కష్టమైనప్పటికీ.. అతను తన శక్తితో నీటిని అందించేందుకు ప్రయత్నిస్తాడు. పిల్లాడు బోరు హ్యాండిల్‌ను అటు ఇటు అంటూ కదిలిస్తుండగా.. కొన్ని నీటి చుక్కలు బయటకు వస్తాయి. దీంతో కుక్క దాహం తీర్చుకోవడం కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసేయండి..
వైరల్ వీడియో..
कद कितना ही छोटा हो, हर कोई किसी की यथासंभव #Help कर सकता है. Well done kid. God Bless you.
VC- Social Media.#HelpChain #Kindness #BeingKind pic.twitter.com/yQu4k5jyh1
— Dipanshu Kabra (@ipskabra) December 7, 2021
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎంత చిన్న వారైనా.. ఎవరైనా ఎవరికైనా వీలైనంత సాయం చేయవచ్చు అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ వీడియో చాలా మంది నెటిజన్ల హృదయాలను తాకింది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా బాలుడి ప్రేమకు ఫిదా అయ్యామని.. ప్రేమ, కరుణ అంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. మానవత్వం ఎప్పుడూ వయస్సు, ఎత్తు, జ్ఞానాన్ని చూడదని.. ఇతరులకు సహాయం చేయడమనేది అంతర్గతంగా మనస్సును నుంచి వస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: