Dog Birthday: పెంపుడు శునకానికి ఘనంగా బర్త్‌డే వేడుకలు..100 కేజీల కేకు, 4 వేల మందికి నాన్ వెజ్ వంటకాలతో విందు.. వీడియో వైరల్
కర్నాటకలోని బెళగావి జిల్లాలో... క్రిష్ అనే పెంపుడు కుక్కకు ఓ రేంజ్‌లో బర్త్‌డే చేశారు దాని ఓనర్లు. ఈ సందడిని చూస్తే ఎవరైనా సరే ఓ మై డాగ్ అనాల్సిందే. ఎందుకంటే.. కుక్కగారి కట్ చేసిన కేక్.. సుమారు 100 కేజీలు ఉంటే.. అతిధులు కూడా ఆ రేంజ్ లో హాజరయ్యారు మరి..
Dog Birthday Celebrations: ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి..ఇది ఒకప్పుటి సామెత… ఇప్పుడూ కుక్క పుట్టిన రోజుకు, పెళ్లి వేడుకక్కి ఊరంతా హడావిడి నయా సామెత.. తమ కుటుంబ సభ్యులతో సమానంగా కుక్కలను చూడడమే.. కాదు.. వాటికి బట్టలు తొడగడం.. పెళ్లిళ్లు, సీమంతం వంటి ఫంక్షన్లు చేయడం నయా ట్రెండ్. ఇప్పటికే ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ.. కుక్కలకు ఘనంగా పెళ్లిళ్లు సాంప్రదాయ పద్దతిలో చేస్తూనే ఉన్నారు…తాజాగా ఈ ట్రెండ్‌నే ఫాలో అయ్యాడు ఓ పెద్దమనిషి. కర్నాటకలోని బెళగావి జిల్లాలో… క్రిష్ అనే పెంపుడు కుక్కకు ఓ రేంజ్‌లో బర్త్‌డే చేశారు దాని ఓనర్లు. ఈ సందడిని చూస్తే ఎవరైనా సరే ఓ మై డాగ్ అనాల్సిందే. ఎందుకంటే.. కుక్కగారి కట్ చేసిన కేక్.. సుమారు 100 కేజీలు (100kgs cake) ఉంటె.. అతిధులు కూడా ఆ రేంజ్ లో హాజరయ్యారు మరి..
పుట్టిన రోజు వేడుకలను అత్యంత ఘనంగా చేసుకున్న ఈ శునక మారాజుకు… కనకపు సింహాసనమొక్కటే తక్కువైంది. బెళగావి జిల్లా తుక్కనట్టి విలేజ్‌లో శివప్ప అనే పెద్దమనిషి తన కుక్కకు క్రిష్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అంతేకాదు… ఆ క్రిష్‌గారి బర్త్‌డేని ఝాంఝాంగా సెలబ్రేట్ చేశాడు. 100 కేజీల భారీ సైజ్‌లో కేక్ తెప్పించి, తన క్రిష్ చేతులతోనే కట్ చేయించాడు. ఆకాశమంత పందిరి లేకపోయినా ఆ స్థాయిలో డెకరేషనైతే కనిపించిందక్కడ. చిన్నపాటి ఊరేగింపు కూడా జరిగింది. 4 వేల మందిని పిలిచి మంచి భోజనం పెట్టించారు. తన కోసం అందంగా తయారైన కలర్‌ఫుల్ కేక్‌ను కూడా ఆబగా తినేసిందా క్రిష్ అనే శునకరాజం.
A man threw an extravagant #birthdayparty for his #petdog by cutting a 100 kg cake and feeding 4000 people with veg & non veg food in Mudalagi taluk #Belagavi #Karnataka. Later, Shivappa Mardi along with his dog Krish went on a procession with a music band. pic.twitter.com/NPX1M5iKk8
— Imran Khan (@KeypadGuerilla) June 23, 2022
ఈ పుట్టినరోజు వేడుక వెనుక ఒక ఇంట్రస్టింగ్ రివెంజ్ స్టోరీ కూడా ఉందండోయ్. 20 ఏళ్ల నుంచి పంచాయతీ మెంబర్‌గా ఉన్న ఈ శివప్ప మీద… కుక్కల్లా తిన్నారు అంటూ సీరియస్ కామెంట్ చేసి కించపరిచాడట మరో పంచాయతీ మెంబర్. దీన్ని మనసులో పెట్టుకుని… ఇప్పుడు తన కుక్క బర్త్‌డేతోనే అతడికి ఇలా స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు క్రిష్ ఓనర్ శివప్ప.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..