AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆకలి తీర్చిన వ్యక్తికి డబ్బు ఇవ్వబోయిన అవ్వ.. వీడియో చూస్తే మీ మనసు చివుక్కుమంటుంది

Viral Video: సోషల్ మీడియా(Social Media)లో షేర్ అయ్యే కొన్ని వీడియోలు వినోదం పంచితే.. మరికొన్ని వింతలు విశేషాలను కనుల ముందుకు తీసుకొస్తాయి. అయితే ఇంకొన్ని హృదయాలను..

Viral Video: ఆకలి తీర్చిన వ్యక్తికి డబ్బు ఇవ్వబోయిన అవ్వ.. వీడియో చూస్తే మీ మనసు చివుక్కుమంటుంది
Homeless Dadi Offers Money
Surya Kala
|

Updated on: Feb 19, 2022 | 8:29 PM

Share

Viral Video: సోషల్ మీడియా(Social Media)లో షేర్ అయ్యే కొన్ని వీడియోలు వినోదం పంచితే.. మరికొన్ని వింతలు విశేషాలను కనుల ముందుకు తీసుకొస్తాయి. అయితే ఇంకొన్ని హృదయాలను తాకుతూ కంట కన్నీరు పెట్టిస్తాయి. మానవత్వం ఇంకా మిగిలే ఉంది అనిపిస్తాయి. మరికొన్ని మనిషి ఆత్మాభిమానం, స్వాభిమానాన్ని తరచి చూపిస్తాయి. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో బామ్మ ఆత్మాభిమానం.. అభిమానం అన్ని కలగలిపి చూపిస్తుంది. ఈ వీడియో  ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఘంటా'(ghantaa) అనే పేజీ లో షేర్ అయింది. ఈ వీడియోకి “మీ పరిసరాలను చూడండి, ఎవరికైనా ఆహారం అవసరం కావచ్చు. వీలైతే వారికి సహాయం చేయండి” అని పేజీ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ఈ వీడియో 1.47 లక్షల లైక్‌లతో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో రోడ్డు పక్కన కూర్చున్న నిరాశ్రయులైన వృద్ధ మహిళ వద్దకు ఒక వ్యక్తి వస్తున్నాడు. అతను ఆమెకు ఒక బాటిల్ వాటర్ ఇచ్చాడు. దానిని ఆ బామ్మ ఎంతో సంతోషంగా తీసుకుంది. అనంతరం ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న ఆహారపొట్లాన్ని కూడా ఇచ్చాడు. దీంతో ఆ బామ్మ ముఖంలో ఎంతో సంతోషం.. ఇష్టంగా ఆ ఆహారపొట్లాన్ని తీసుకుంది.  ఆ బామ్మ ముఖంలో చిరునవ్వు , కృతజ్ఞతగా చేతులు ఎత్తి దణ్ణం పెట్టింది.

View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

అయితే వెంటనే ఆ బామ్మ తన చీర కొంగులో కట్టిన డబ్బులను బయటకు తీసి.. తనకు నీరు, ఆహారం అందించిన వ్యక్తి చేతిలో పెట్టడానికి ప్రయత్నించింది. అయితే అన్నం పెట్టిన వ్యక్తి.. ఆ బామ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు..ఎవరు తీశారో కూడా తెలియదు..కానీ నెట్టింట్లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ వీడియో తమను నిజంగా భావోద్వేగానికి గురిచేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు కొంతమంది తమ కళ్లలో నీళ్లు తెప్పించిందని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు చూసి నప్పుడు తమ గుండె పగిలిపోతుందని ఇంకొందరు చెప్పారు.

Daddiii 437x187

Also Read:

హైదరాబాద్‌ డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..