Viral Video: ఇలా ఎప్పుడైనా మీరు కారు టర్న్‌చేశారా.. ఈ డ్రైవర్‌ టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా

Viral Video Driver Tallent: సోషల్‌ మీడియా(social meida)లో రకరకాల వీడియోలు చూస్తుంటాం. అందులో కొందరు చేసే స్టంట్స్‌ ఉత్కంఠ రేపుతాయి... అలాగే ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట..

Viral Video: ఇలా ఎప్పుడైనా మీరు కారు టర్న్‌చేశారా.. ఈ డ్రైవర్‌ టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా
Car U Turn Video Viral
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Feb 11, 2022 | 3:02 PM

Viral Video Driver Talent: సోషల్‌ మీడియా(Social Media)లో రకరకాల వీడియోలు చూస్తుంటాం. అందులో కొందరు చేసే స్టంట్స్‌ ఉత్కంఠ రేపుతాయి… అలాగే ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఒక కార్‌ డ్రైవర్‌ టాలెంట్‌కి నెటిజన్లు సలాం చేస్తున్నారు. లక్షలమంది మళ్లీ మళ్లీ వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీకు గుండె వేగం పెరగడం మాత్రం ఖాయం… ఎందుకంటే… ఈ వీడియోలో ఓ వ్యక్తి అసాధ్యం అనుకున్న చోట కారు నడుపుతూ టర్న్‌ చేసాడు. ఆ కారు ఉన్న ప్రదేశం చూస్తే అసలు టర్న్‌ అనే మాటకే అవకాశం లేదనిపిస్తుంది. అది ఎత్తయిన కొండ అంచు ప్రదేశం. నిజానికి అతి జాగ్రత్తగా రివర్స్‌లో వస్తే తప్ప్ వెళ్లలేం. కానీ ఇతను మాత్రం ఆ ఎత్తైన కొండ అంచున సెడాన్ కారును యూటర్న్ తిప్పాడు.

ఆ టైంలో ఒక్కోసారి కారు మూడు చక్రాలకు మాత్రమే సపోర్ట్‌ ఉండగా నాలుగో చక్రానికి ఎలాంటి సపోర్ట్‌ లేదు.. ఈ పరిస్థితిలో ఏమాత్రం తేడా వచ్చినా కారు లోయలో పడిపోతుంది. అయినా ఆ డ్రైవర్‌ ఎంతో చాకచక్యంగా మూడు చక్రాలనే ఉపయోగిస్తూ అసాధ్యం అనుకున్న చోట కారు యూ టర్న్‌ చేసి హాట్సాఫ్‌ అనిపించుకున్నాడు. ఈ వీడియోని మొదట చైనాలోని టిక్ టాక్ గా పిలిచే దౌయిన్ లో పోస్ట్ చేశారు. తర్వాత దీన్ని ఫేస్ బుక్ లో షేర్ చేశారు.

కాగా ఇలాంటిదే మరో వీడియో ట్విట్టర్ లో జనవరి 23న ఓ యూజర్‌ పోస్ట్ చేశారు. ఈ 27 సెకండ్ల వీడియోలో కూడా ఘాట్ రోడ్డు ఇరుకుగా ఉంది. రోడ్డు పక్కన లోయ ఉంది. అలాంటి చోట అతను కారును యూటర్న్ చేశాడు. అతనికి సాయం చేసేవారు ఎవరూ లేరు. అయినప్పటికీ ఆ డ్రైవర్ కారులో కూర్చొని రెండు మూడు సార్లు అటూ ఇటూ కదుపుతూ కారును తిప్పేస్తాడు. అతను కారును తిప్పుతున్నప్పుడు, దాని వెనక చక్రాలు ఒక్కోసారి రోడ్డును దాటి లోయవైపు వేలాడాయి. కానీ డ్రైవింగ్‌లో స్కిల్స్ కారణంగా అతను కారును తిప్పగలిగాడు. ఎంతో ట్రైనింగ్ ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కావు. ఇలాంటి ప్రయోగాలు చేసి ఫెయిలైన వారు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఈ వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Also Read:   ఆవు దూడని కారులో షికారుకి తీసుకొచ్చిన అందమైన అమ్మాయి.. నెట్టింట్లో వైరల్..