Viral Video: ‘అసలు బుద్ధుందా’..? చీర కోసం బిడ్డ ప్రాణాన్ని పణంగా పెట్టాలా..?
హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్ నుంచి ఒక షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Trending Video: ఓ మహిళకు వచ్చిన పిచ్చి ఐడియాను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్లో పడిపోయింది. అయితే ఆ సమయంలో ఆ కింది ఇంటి వాళ్లు లేకపోవడంతో.. చీర కిందకు వెళ్లి తీసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో ఆ మహిళ ఊహకందని పని చేసింది. తన కొడుకును మరో చీర సహాయంతో బాల్కనీ కిందకు పంపి.. చీరను పైకి తెప్పించుకుంది. అది కూడా తొమ్మిదవ ఫ్లోర్ నుంచి ఎనిమిదవ ఫ్లోర్‌కు పంపింది. ఇతర కుటుంబ సభ్యులు అతన్ని పైకి లాగడం ఆ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ సీన్‌కు సంబంధించిన వీడియోను.. ఆ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న మరో అపార్ట్‌మెంట్‌లో నుంచి మరో వ్యక్తి రికార్డు చేశాడు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటు ఆ బుడ్డోడు కూడా చీరను తాడు ఏ మాత్రం జంకు లేకుండా కిందకు దిగి, అలాగే పైకి వెళ్లాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం ఆ మహిళను ట్రోల్ చేస్తున్నారు. పిల్లోడి ప్రాణాలు లెక్కచేయకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై సీరియస్ అవుతున్నారు. తల్లి బిడ్డతో ఇలాంటి పని చేయించిందంటే నమ్మలేకపోతున్నామని కామెంట్లు పెడుతున్నారు. ఆమె గుండె ఎంత కఠినమైనదో అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.
వీడియో చూడండి
Also Read: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్
ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మాస్ హీరోగా రచ్చ చేస్తున్నాడు.. ఎవరో గుర్తించారా..?