Watch: ఎప్పటిలానే వాషింగ్ మిషన్ లో బట్టలు వేద్దాం అనుకున్నాడు.. ఓపెన్ చేయగా నల్లటి ఆకారం
ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని వాషింగ్ మెషీన్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ రేపటి నుండి బట్టలు ఉతకడం మానేయండి అంటున్నారు. పాపం మూగజీవి బయట కాలుష్యం భరించలేక.. కడుక్కోవడానికి ఇలా ఆ ఇంటికి వచ్చిందేమో అంటూ ఒకరు రాశారు. బయట అధిక వేడి కారణంగా అది ఇలా వాషింగ్ మెషీన్‌లోకి వెళ్లి ఉండవచ్చని ఇంకొకరు వ్యాఖ్యనించారు. మొత్తానికి
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ సర్వసాధారణమైపోయింది. అయితే, వాషింగ్ మెషీన్‌లో కూడా పాములు దూరుతాయనే విషయం మాత్రం సాధారణమైంది కాదు..వెరీ రేర్.. అవును మీరు చదివింది నిజమే.. వర్షాకాలంలో పాములు పొడి ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి దూరుతాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఈ సారి ఓ ఇంట్లో దూరిన పాము.. అక్కడ ఇక్కడ కాకుండా ఏకంగా వాషింగ్ మెషీన్‌లో దాక్కుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. బట్టలు వాషింగ్ మెషీన్‌లో వేసేందుకు వచ్చిన ఆ మహిళకు నల్లటి ఆకారంతో నాగుపాము పడగవిప్పి బయపెట్టింది. ఈ వీడియో రాజస్థాన్‌లోని కోటా నగరానికి చెందినదిగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ వీడియో చూడండి..
#Watch : कोटा शहर में एक शख्स के तब होश उड़ गए जब उसने कपड़े साफ करने के लिए वॉशिंग मशीन का ढक्कन हटाया। शख्स ने जब वॉशिंग मशीन का ढक्कन खोला तो उसमें फन फैलाए बड़ा सा कोबरा बैठा था। इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।#Snake #Kota #Rajasthan pic.twitter.com/elTFnfJ4ht
— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) August 20, 2024
ఈ వీడియోని కోట నగరానికి చెందిన ఒక వ్యక్తి షేర్ చేశారు. వీడియో చూసిన ప్రజలు ఈ ఘటనతో భయపడిపోయారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని వాషింగ్ మెషీన్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ రేపటి నుండి బట్టలు ఉతకడం మానేయండి అంటున్నారు. పాపం మూగజీవి బయట కాలుష్యం భరించలేక.. కడుక్కోవడానికి ఇలా ఆ ఇంటికి వచ్చిందేమో అంటూ ఒకరు రాశారు. బయట అధిక వేడి కారణంగా అది ఇలా వాషింగ్ మెషీన్‌లోకి వెళ్లి ఉండవచ్చని ఇంకొకరు వ్యాఖ్యనించారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..