వందే భారత్ ప్రయాణికుడికి షాక్.. ఆర్డర్‌ ఇచ్చిన ఫుడ్ చూసి గుడ్లు తేలేశాడు.. అట్లుంటది మరి..!

ఇలాంటి ఘటనలు భారతీయ రైల్వేలో పరిశుభ్రత పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి. క్లీనింగ్‌ విషయంలో సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, క్రమం తప్పకుండా తనిఖీలు వంటివి నిర్వహించడం చేయాలని, నిర్వహణ, శుభ్రత పట్ల తగిన ప్రమాణాలు పాటించేలా చూసుకోవడం అలవాటు చేసుకోవాలని ప్రజలు, నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రయాణీకులు కూడా

వందే భారత్ ప్రయాణికుడికి షాక్.. ఆర్డర్‌ ఇచ్చిన ఫుడ్ చూసి గుడ్లు తేలేశాడు.. అట్లుంటది మరి..!
Vande Bharat Express
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2024 | 5:39 PM

దేశంలోనే అత్యంత ప్రీమియం రైళ్లలో ఒకటిగా నిలిచిన భారతీయ రైల్వే వందే భారత్ రైలుపై ఇటీవల అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. రైలులో సప్లై చేస్తున్న ఫుడ్‌ నాణ్యత పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పదే పదే వందేభారత్‌ రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహారం విషయం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రయాణికులకు అందించిన ఆహారంలో సజీవ బొద్దింక కనిపించడంతో రైలు పరిశుభ్రతపై ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రికీ జెస్వానీ అనే ప్రయాణికుడు తన కుటుంబంతో కలిసి షిర్డీ నుండి ముంబైకి వెళుతుండగా వారు డిన్నర్ ఆర్డర్ చేశారు. వారికి డిన్నర్‌లో పప్పు వడ్డించారు. అయితే ఆ పప్పులో చెంచా పెట్టగానే వారికి కడుపులోంచి దేవేసినట్టుగా అయింది.. రికీ ఫ్యామిలీకి సప్లై చేసిన పప్పులో సజీవ బొద్దింక కనిపించింది. వెంటనే అదంతా ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిని రికీ సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో వేగంగా వైరల్ అయ్యింది. ఈ ఘటన ఆగస్టు 19న జరిగింది. అతను రైలు ప్యాంట్రీ ఫోటోలను కూడా ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశాడు. అక్కడ వాతావరణం మరీ దారుణంగా ఉందని వాపోయాడు. కిచెన్‌ ఏరియా పూర్తిగా మురికిగా ఉందని చెప్పాడు. వైరల్‌గా మారిన వీడియోపై రైల్వే యంత్రాంగం స్పందించింది. తక్షణ దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణీకుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇలాంటి ఘటనలను సహించేది లేదంటూ సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

కానీ, ఇలాంటి ఘటనలు భారతీయ రైల్వేలో పరిశుభ్రత పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి. క్లీనింగ్‌ విషయంలో సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, క్రమం తప్పకుండా తనిఖీలు వంటివి నిర్వహించడం చేయాలని, నిర్వహణ, శుభ్రత పట్ల తగిన ప్రమాణాలు పాటించేలా చూసుకోవడం అలవాటు చేసుకోవాలని ప్రజలు, నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రయాణీకులు కూడా ఇటువంటి సంఘటనల పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని, ఏదైనా అసౌకర్యం, అసంతృప్తిని ఎదుర్కొంటే వెంటనే రైల్వే అధికారులకు తెలియజేయాలని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..