Viral Video: రీల్ కోసం రిస్క్ చేసి బోర్లబొక్కల పడే… అవసరమా బ్రో… 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన యువకుడు
రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చుట్టూ వున్నవారి మెప్పుకోసమే లేక సోషల్ మీడియా యూజర్ల కామెంట్ల కోసమో ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రీల్ కోసం ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక యువకుడిని...

రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చుట్టూ వున్నవారి మెప్పుకోసమే లేక సోషల్ మీడియా యూజర్ల కామెంట్ల కోసమో ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రీల్ కోసం ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక యువకుడిని చూపించే ఈ వీడియో సోషల్ మీడియా క్రేజ్ ఎలా ఉంటుందో చాటి చెబుతోంది. వైరల్ క్లిప్‌లో, ఆ యువకుడు చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సులో దాదాపు 20 అడుగుల ఎత్తు నుండి పడిపోతాడు. ఈ సంఘటన రాళ్లను ఢీకొట్టి తలకు గాయమైనట్లు చూపిస్తుంది.
హాస్యాస్పదంగా, “యే క్యా హువా, కైసే హువా” అనే నేపథ్య పాట ఆశ్చర్యకరంగా పరిస్థితికి సరిపోలింది. సరస్సు పక్కన ఉన్న సరిహద్దు గోడపైకి దూకుతున్నప్పుడు యువకుడు తన బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు వీడియో చూపిస్తుంది. అదృష్టవశాత్తూ, అతను సరస్సులో పడి స్పృహ కోల్పోయిన తర్వాత పర్యాటకులు అతన్ని సరస్సు నుండి బయటకు తీయగలిగారు. ఈ మొత్తం సంఘటనను సంఘటన స్థలంలో ఉన్న అతని స్నేహితులు చిత్రీకరించారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సోషల్ మీడియా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని DSP ఉదయ్‌పాల్ హెచ్చరించారు.
వీడియో చూడండి:
How these idiots set precedent in public view. Risking life for Reels. A young boy at Sukhna Lake Chandigarh presented his stunt and ended up injured pic.twitter.com/dqSiEdgekr
— Taruni Gandhi (@TaruniGandhi) July 5, 2025
వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పుడు చెయ్యి స్టంటు రీల్ అంటూ సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. తమ్ముడు బతికి పోయిండు పో అంటూ మరొకరు పోస్టు చేశారు. కొంతమందికి పళ్లూడినా బుద్ది రాదు.. మళ్లీ ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటారు అంటూ మరికొంత మంది నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు.
