AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కస్టడీలో చుక్కలు చూపిస్తున్న గుర్రం… గుర్రాన్ని వదిలి స్మగ్లర్‌ పరారీ!

గుర్రాన్ని వదిలి స్మగ్లర్‌ పరారైన ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. దీంతో పశ్చిమ చంపారన్ జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కొత్త సమస్యలో చిక్కుకున్నారు. గుర్రాన్ని పట్టుకుని కస్టడీలోనైతే పెట్టారు గానీ దాన్ని మేపడానికి పోలీసులు అగచాట్లు పడుతున్నారు. అక్రమ మద్యం రవాణా ఘటనలో గుర్రం పట్టుబడింది. దాన్ని వదలి...

Viral Video: కస్టడీలో చుక్కలు చూపిస్తున్న గుర్రం... గుర్రాన్ని వదిలి స్మగ్లర్‌ పరారీ!
Horse In Custody
K Sammaiah
|

Updated on: May 29, 2025 | 8:25 PM

Share

గుర్రాన్ని వదిలి స్మగ్లర్‌ పరారైన ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. దీంతో పశ్చిమ చంపారన్ జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కొత్త సమస్యలో చిక్కుకున్నారు. గుర్రాన్ని పట్టుకుని కస్టడీలోనైతే పెట్టారు గానీ దాన్ని మేపడానికి పోలీసులు అగచాట్లు పడుతున్నారు. అక్రమ మద్యం రవాణా ఘటనలో గుర్రం పట్టుబడింది. దాన్ని వదలి పరారైన స్మగ్లర్‌ ఆచూకీ తెలియకపోవడంతో గుర్రాన్ని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. ఈ క్రమంలో గుర్రాన్ని సంరక్షించే వ్యక్తికోసం పోలీసుల ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేసు విచారణ అనంతరం గుర్రాన్ని ప్రభుత్వం వేలం వేయనుంది.

మే 27న 50 లీటర్ల అక్రమ మద్యం రవాణా చేస్తుండగా నౌతన్ పోలీసులు జరిపిన దాడిలో ఈ గుర్రం చిక్కింది. స్మగ్లింగ్‌ చేస్తున్న అకాశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అతని గురించి పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ గుర్రాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంచి చూసుకుంటున్నామని నౌతన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఖర్చులతోనే దానికి పచ్చిగడ్డి, శనగలు, బెల్లం వంటివి ఆహారంగా అందిస్తున్నామని చెప్పారు. గుర్రాలను సంరక్షించడంలో అనుభవం ఉన్న సరైన వ్యక్తి దొరికిన తర్వాత, అధికారిక ప్రక్రియ ద్వారా గుర్రాన్ని వారికి అప్పగిస్తామని వెల్లడించారు.

కేసు విచారణ సమయంలో అవసరమైనప్పుడు గుర్రాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. విచారణ పూర్తయి, తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ గుర్రాన్ని వేలం వేస్తుంది. కోర్టు ప్రక్రియ కొనసాగినంత కాలం గుర్రాన్ని సంరక్షించిన వ్యక్తికి వేలంలో దాన్ని కొనుగోలు చేసేందుకు మొదటి అవకాశం కల్పిస్తారు. ఒకవేళ వారు ఆసక్తి చూపకపోతే, ఇతరులకు ఆ అవకాశం దక్కుతుంది. అయితే పోలీస్‌ కస్టడిలో గుర్రం అనే అంశం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

వీడియో చూడండి:

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు