Viral Video: రౌండప్ చేసిన అడవి పందులు.. ఈ చిరుత చేసిన పని ఏంటో తెలిస్తే నివ్వెరపోతారు
చిరుతపులులు నిశ్శబ్దంగా జంతువులను పసిగట్టి, అతి దగ్గరిగా చేరి.. నక్కుతాయి. ఆపై ఒక్కసారిగా దాడి చేస్తాయి. వేటాడి తిన్న తర్వాత, మిగిలిన ఆహారాన్ని చెట్లపైకి తీసుకెళ్లి దాచడం వీటికి ప్రత్యేక లక్షణం. ఇలా చేయడం ద్వారా ఇతర జంతువుల నుండి తమ ఆహారాన్ని రక్షిస్తాయి. అయితే తాజాగా అడవి పందులు ఓ చిరుతను రౌండప్ చేశాయి. ఆ తర్వాత..

పందులన్నీ ఒక వైపు.. చిరుత మరోవైపు.. ఇలాంటి సీన్ మీరు ఎప్పుడూ చూసి ఉండరు. సహజంగా అడవిలో సింహం, పులి, చిరుత వంటి బలమైన జంతువులను… బలహీన జంతువులు గుంపులుగా ఉండి ఎదుర్కొంటూ ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. చెట్టెక్కిన చిరుతను అడవి పందులు టార్గెట్ చేశాయి. కానీ చిరుతపులి అత్యంత తెలివైన, శక్తివంతమైన జంతువులలో ఒకటి. అందుకే అది తన ఉనికి చాటుకుంది. రెప్పపాటు వ్వవధిలో మెరుపు వేగంతో కిందకు దిగి.. గుంపులో నుంచి ఒక పందిని నోటబట్టి.. అంతే వేగంతో చెట్టు ఎక్కింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వీడియో దిగువన చూడండి…
View this post on Instagram
అడవి పందుల గుంపు చుట్టుముట్టడంతో.. చిరుత చెట్టు ఎక్కింది. అయినప్పటికీ చిరుతలో ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే అలాంటి 100 పందులు ఉన్నా.. చిరుత ఈజీగా అక్కడి నుంచి తప్పించుకోగలదు. అందుకే అది ప్రశాంతంగా, దృష్టిని ఒక పందిపైనే కేంద్రీకరించి ఉంచింది. హఠాత్తుగా తనకున్న శక్తి, చాకచక్యంతో కిందకు దూకింది. క్షణాల్లోనే ఒక పందిని దవడలతో బంధించి.. వెంటనే తిరిగి చెట్టు పైకి ఎక్కింది.
అందుకే చిరుత అడవిలో అగ్రగామి జంతువుగా నిలిచింది. నిశ్శబ్దంగా ఉండడం, అపారమైన బలాన్ని ప్రదర్శించడం, ఎంతటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా వ్యవహరించడం – ఇవన్నీ దీని ప్రత్యేకతలు. చుట్టూ ఉన్న పందుల సంఖ్య ఎంతైనా చిరుత తన సమర్ధతను చాటుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
