Viral News: పేరులేని వింత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి.. బీరు బాటిల్స్ తో సరికొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టి

అమెరికాకు చెందిన జేమీ కీటన్ అనే వ్యక్తి  ఓ వింత వ్యాధితో  ప్రపంచ రికార్డు సృష్టించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఏకంగా 10 బీరు డబ్బాలను తలపై తగిలించుకుని అద్వితీయమైన ఘనత సాధించాడు.

Viral News: పేరులేని వింత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి.. బీరు బాటిల్స్ తో సరికొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టి
Us Man World Record
Follow us
Surya Kala

|

Updated on: Jul 17, 2022 | 1:41 PM

Viral News: ఈ ప్రపంచంలో అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి.. మరికొన్ని ప్రాణాలకు అపాయం కలిగించవు. ప్రాణాలకు ప్రమాదకరమైన వ్యాధులు క్యాన్సర్, AIDS, TB మొదలైనవి. అదే సమయంలో కొన్ని వ్యాధులు ప్రమాదకరమైనవి.. కావు.. అంతేకాదు చాలా అరుదుగా ఉంటాయి. కొన్ని కేసులు ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.  ట్రీ మ్యాన్ సిండ్రోమ్, జిరోడెర్మా పిగ్మెంటోసా సిండ్రోమ్,  స్టోన్‌మ్యాన్ సిండ్రోమ్ మొదలైనవి ఉన్నాయి. ఇవేకాదు.. ఇలాంటి మరికొన్ని వింత వ్యాధులు ఉన్నాయి చాలా అరుదుగా కూడా ఈ వ్యాధులు పరిగణించబడతాయి. వీటికి ఇప్పటికి పేరు కూడా పెట్టలేదు. అటువంటి ‘పేరు లేని.. విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు ఓ వ్యక్తి. అంతేకాదు ఈ వింత వ్యాధి కారణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.

అమెరికాకు చెందిన జేమీ కీటన్ అనే వ్యక్తి  ఓ వింత వ్యాధితో  ప్రపంచ రికార్డు సృష్టించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఏకంగా 10 బీరు డబ్బాలను తలపై తగిలించుకుని అద్వితీయమైన ఘనత సాధించాడు. సాధారణంగా గాలి ఒత్తిడి సహాయంతో ఒక్క బీరు డబ్బాను శరీరానికి అతికించుకోవడమే అతి కష్టము.. మరి అలాంటిది.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది డబ్బులను ఒంటికి అతికించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అయితే జామీ ఇలాంటి రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే 2016లో కూడా ఇదే రికార్డు సృష్టించాడు. ఆ ఏడాది మొత్తం 8 డబ్బాలను తలపై అతికించుకుని రికార్డ్ సృష్టించాడు అయితే జామీ రికార్డును 2019 సంవత్సరంలో జపాన్‌కు చెందిన షునిచి కానో బద్దలు కొట్టాడు. అతను తన తలపై మొత్తం 9 డబ్బాలను అతికించుకున్నాడు.. గత రికార్డ్ ను బీట్ చేసి.. తన పేరిట ఈ అపూర్వ రికార్డును నమోదు చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం,  డబ్బాలు దాదాపు 5 సెకన్ల పాటు జామీ తలకు అంటుకున్నాయి. ఇంకా పేరు పెట్టని ఒక వింత చర్మ వ్యాధి వలన  జామీ ఈ రికార్డు సృష్టించడానికి సహాయపడింది. ఈ వ్యాధి కారణంగా జామీ చర్మంమీద రంధ్రాలు ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. దీని సహాయంతో డబ్బా సులభంగా తలపై అంటుకుంటుంది. తన చిన్నతనంలో బొమ్మలతో ఆడుకునేవాడినని.. ఒక్కోసారి ఆ బొమ్మలు తన చేతులకు అతుక్కుపోయేవని జామీ చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..