Viral Photo: నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు చేస్తుంటే.. అధ్యక్ష భవనంలో ఫోటోషూట్ చేసింది..
ప్రజలు అధ్యక్ష నివాసంలోకి ప్రవేశించి భారీ ఎత్తున్న నిరసన తెలుపుతున్న సమయంలో.. మధుహన్సి హసింతర (Maduhansi Hasinthara) అనే అమ్మాయి టూరిస్ట్ స్టైల్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
Sri Lanka President’s palace: చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభ పరిస్థితిని శ్రీలంక ఇప్పుడు ఎదుర్కొంటోంది. దీంతో భవిష్యత్తు ఏంటో తెలియక లంకేయులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చివరకు ఎమర్జెన్సీ విధించే దుస్థితి తలెత్తింది. ఇక ఇప్పటికే శ్రీలంక అధ్యక్ష భవాన్ని వేలాది మంది నిరసనకారులు ముట్టడించి ఆందోళనలు చేస్తుంటే.. ఓ అమ్మాయి మాత్రం అక్కడ ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటో షూట్ ఇఫ్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రజలు అధ్యక్ష నివాసంలోకి ప్రవేశించి భారీ ఎత్తున్న నిరసన తెలుపుతున్న సమయంలో.. మధుహన్సి హసింతర (Maduhansi Hasinthara) అనే అమ్మాయి టూరిస్ట్ స్టైల్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. అధ్యక్ష భవనం బయట, లోపల ఫొటోషూట్ చేసింది. భవనంలోని బెడ్, చైర్లు, సోఫాలు, కారు పక్కన, పెరట్లో ఫొటోలు దిగింది. కొలంబోలోని అధ్యక్ష భవనం దగ్గర అనే క్యాప్షన్ తో మొత్తం 26 ఫొటోలను మధుహన్సి హసింతర తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నువ్వు మామూలుదానివి కాదమ్మ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
కాగా.. శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు లంకేయులు ముందుకొస్తున్నారు. ఈ మేరకు విదేశాల్లో స్థిరపడిన వారు శ్రీలంకకు సాయం ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక డాలర్ ఛాలెంజ్ ట్రెండింగ్ అవుతుంది.
దేశ ప్రజల ఆగ్రహానికి గురై దేశం వదిలి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా తర్వాత ఆదేశంలో పెను మార్పులు జరుగుతున్నాయి. గొటబాయ రాజీనామాపై స్పందించిన ప్రవాశీయులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడినవారు స్వదేశంపై మమకారంతో డాలర్లు పంపుతున్నారు. ఇప్పటికే డిపాజిట్ చేసిన స్లిప్‌లను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..