Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ట్రైన్ వస్తుండగా.. వీడియోకు పోజిద్దామనుకున్నాడు.. విగత జీవిగా మారిపోయాడు..

వీడియోలకు లైక్స్ కోసం కొంతమంది యువతీయువకలు వేస్తున్న వెర్రి వేషాలు అన్నీ, ఇన్నీ కాదు. కొందరైతే ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు.

Viral: ట్రైన్ వస్తుండగా.. వీడియోకు పోజిద్దామనుకున్నాడు.. విగత జీవిగా మారిపోయాడు..
Hit By Train
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 22, 2021 | 6:56 PM

వీడియోలకు లైక్స్ కోసం కొంతమంది యువతీయువకలు వేస్తున్న వెర్రి వేషాలు అన్నీ, ఇన్నీ కాదు. కొందరైతే ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. సరదా కోసం చేసిన పని ప్రాణాలు తీసింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో యువకుడు పట్టాలపై ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఫ్రెండ్‌కి చెప్పాడు. అయితే ట్రైన్ దూసుకువచ్చింది. రైలు వేగాన్ని అతడు అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఎదురుగా వీడియో తీస్తున్న వ్యక్తి కూడా అతన్ని అలెర్ట్ చేయడంలో అలసత్వం వహించాడు. ట్రైన్ డ్రైవర్ నాన్‌-స్టాప్‌గా హారన్ కొట్టినప్పటికీ.. సదరు యువకుడు పట్టించుకోలేదు. దీంతో వేగంగా దూసుకొచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం అవ్వడంతో.. ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా.. దారిలోనే అతడు మరణించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. శరద్​దేవ్​ ఆలయ దర్శనానికి వెళ్లిన వీరు పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. మృతుడిని పంజార కలా గ్రామానికి చెందిన సంజూ చౌరేగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, అతని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడు సోషల్​ మీడియాలో అప్లోడ్​ చేసేందుకు ఫ్రెండ్‌తో కలిసి వీడియో తీస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. చూశారాగా.. సరదా కోసం చేసిన పని.. ప్రాణాన్ని హరించింది. దయచేసి.. ఇలాంటి పనులు చేసేందుకు సాహసించకండి.

Also Read: కారులో వచ్చిన ఈ ఆంటీలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్..

AP Floods: వరదల్లో డ్యామేజ్‌ అయిన ఇళ్లకు కూడా పరిహారం.. ఏపీ మంత్రి ప్రకటన