Viral Video: అందమైన జానపదానికి నెమలిలా ఆడిన అమ్మడు.. వైరల్ అవుతున్న వీడియో

పాటలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. అందులోనూ జానపదాలంటే చెవికోసుకునేవారు కోకొల్లలు ఉన్నారు.. అందమైన పల్లె పాటలను గుండెతో ఆలకిస్తూ ఉంటారు చాలా మంది.

Viral Video: అందమైన జానపదానికి నెమలిలా ఆడిన అమ్మడు.. వైరల్ అవుతున్న వీడియో
Dance
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2022 | 9:14 PM

Viral Video: పాటలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. అందులోనూ జానపదాలంటే చెవికోసుకునేవారు కోకొల్లలు ఉన్నారు.. అందమైన పల్లె పాటలను గుండెతో ఆలకిస్తూ ఉంటారు చాలా మంది. ఆ మాటల్లో కమ్మదనం, ఆ సాహిత్యంలో తియ్యందనం ఆస్వాదించడం కూడా ఓ గొప్ప అనుభూతి. అలాంటి జానపదానికి ఓ అందమైన అమ్మాయి నెమలిలా నాట్యం చేస్తే ఎలా ఉంటుంది. ఈ వీడియోలా ఉంటుంది. బావల్ల నా బావల్ల అనే ఫోక్ సాంగ్ ఎంత ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట యువతను ఓ ఊపుఊపింది. ఇప్పుడు ఈ పాటకు ఓ అందమైన వనిత.. సంగీతానికి తగ్గట్టు స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అచ్చతెలుగు అమ్మాయిలా ముస్తాబైన ఓ యువతి ఈ ఫోక్ సాంగ్ కు అద్భుతంగా డాన్స్ చేసింది. అమ్మడి హావభావాలు కుర్రాళ్ళ మనసులను గిలిగింతలు పెడుతున్నాయి. ఇప్పుడు ఈ చిన్నదాని చిందులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈవీడియో పాతదే అయినా వెతికి మరీ అమ్మడి డాన్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. చూడచక్కని రూపం.. అచ్చ తెలుగు పడుచుపిల్ల లంగావోణీ కట్టుకొని ముద్దుముద్దుగా వేసిన స్టెప్పులు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. ఈ లవ్లీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి