Watch Video: వామ్మో..! టెక్నాలజీపై కన్నేసిన కోతులు.. వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రి..
టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను కోతులు కూడా క్రమ క్రమంగా నేర్చుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో బాగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోతులకు కూడా చేరింది. ఇందుకు సంబంధించిన..

కోతులు చాలా తెలివైనవని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పుడూ అల్లరి చిల్లరగా చెట్టు నుంచి మరో చెట్టుకు, గోడ మీద నుంచి మరో గోడకు దూకే కోతులు మహా ముదుర్లు కూడా. ఇక కోతులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలను మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఆహారం విషయానికొస్తే మానవ జాతికి మూలంగా పరిగణించే కోతుల మన చేతిలో ఏదైనా తినే పదార్థం కనిపిస్తే లాక్కునే వరకూ వదిలిపెట్టవు. ఎందుకంటే వాటికి అమెజాన్, స్విగ్గీ వంటి సర్వీసెస్ లేవు. ఆ సర్వీసెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియదు. అయితే టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను కోతులు కూడా క్రమ క్రమంగా నేర్చుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో బాగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోతులకు కూడా చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన కోతి వీడియోను చూస్తే మీరు ఇది నిజమే అనకుండా ఉండలేరు. జనవరి 19న కిరణ్ రిజీజు ట్వీట్ చేసిన ఈ వీడియోలో మూడు కోతులు ఒక ఫోన్‌ను ఆపరేట్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఇందులో ఒక కోతి ఫోన్ స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తుండగా.. పక్కన ఉన్న రెండు కోతులు దానికి సజ్జెషన్స్ ఇస్తున్నాయి. ‘డిజిటల్ విప్లవం సాధించిన విజయం ఏ స్థాయిలో ఉందో చూడండి’ అనే కాప్షన్‌తో కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.




నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..
Look at the success of digital literacy awareness reaching an unbelievable level! pic.twitter.com/VEpjxsOZa3
— Kiren Rijiju (@KirenRijiju) January 19, 2023
ఇప్పటికే దాదాపు 4 లక్షల వీక్షణలు వచ్చిన ఈ వీడియోను సుమారు నాలుగు వేల మంది లైక్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే చాలా ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. వారిలో ఒక నెటిజన్ ‘ వావ్..! ఎంత అద్భుతమైన వీడియో ఇది ఉత్తమమైన వాటిలో ఒకటి’ అని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘కోతులు టెక్నాలజీని వాడడం మొదలు పెట్టేశాయ్..’ అని రాసుకొచ్చాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..