ముక్కు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. ప్రాణమే పోయింది
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దాస్పత్రిలో ఓ మహిళ ముక్కుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దాస్పత్రిలో ఓ మహిళ ముక్కుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటకు చెందిన వెంకటలక్ష్మి, ముత్తయ్య భార్యాభర్తలు. వెంకటలక్ష్మి గత కొంతకాలంగా సైనస్ సమస్యతో బాధపడుతోంది. చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రాగా పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఈక్రమంలో ఆమె ముక్కుకు ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. అయితే, అంత వరకు బాగానే ఉన్న వెంకటలక్ష్మి మృతి చెందినట్లు తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి ఫర్నీచర్ ధ్వంసం చేసి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వెంకటలక్ష్మి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరల్డ్ బెస్ట్ ఫిల్మ్‌గా RRR.. స్పీల్ బర్గ్‌నే వెనక్కి నెట్టిన జక్కన్న