Coffee Test: జాబ్ ఇంటర్వ్యూలో ‘కాఫీ టెస్ట్’.. ఎం.డీ కొత్త ఫార్ములా.. వైరల్ అవుతున్న వీడియో.
సాధారణంగా ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అభ్యర్థుల గత ఉద్యోగ అనుభవం, నైపుణ్యాల వంటివి చూస్తుంటారు. కానీ ఆస్ట్రేలియాకు
సాధారణంగా ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అభ్యర్థుల గత ఉద్యోగ అనుభవం, నైపుణ్యాల వంటివి చూస్తుంటారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ ఎండీ మాత్రం అభ్యర్థులకే తెలియకుండా వారికి ‘కాఫీ టెస్ట్ ’ పెడుతున్నారు.ట్రెంట్ ఇన్స్ .. ‘జీరో ఆస్ట్రేలియా’ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవల ఈ కంపెనీలో రిక్రూట్‌మెంట్‌కు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ‘‘అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే ముందు వారిని నాతో పాటు కిచెన్‌లోకి తీసుకెళ్లి కాఫీ ఇప్పిస్తా. ఆ కాఫీ కప్పులు పట్టుకుని తిరిగి ఇద్దరం సీట్లలోకి వస్తాం. ఆ తర్వాత జాబ్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఈ క్రమంలోనే నేను అభ్యర్థిని పరిశీలించేది ఏంటంటే.. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఖాళీ కప్పును ఆ వ్యక్తి కిచెన్‌లోకి తీసుకెళ్తాడా? లేదా ? అని చూస్తాను’’ అంటూ ట్రెంట్ ఇన్స్ వివరించారు.అభ్యర్థులు కాఫీ కప్పు శుభ్రం చేస్తారా? లేదా? అనేదే ఈ టెస్టు ముఖ్య ఉద్దేశం. దీంతో సదరు వ్యక్తి ధోరణి ఎలా ఉంటుంది? అతడు ఈ కంపెనీకి సరిపోతాడా? అనే దానిపై తాను ఓ అంచనాకు వస్తానని ట్రెంట్ తెలిపారు. ‘‘ ప్రవర్తన అనేది వ్యక్తికి చాలా ముఖ్యం. అదే కంపెనీ అభివృద్ధికి దోహదపడుతుంది.’’ అని ఈ ఇంటర్వ్యూ విధానం వెనుక తన అభిప్రాయాన్ని వివరించారు ట్రెంట్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..