VIral Video: సర్జరీ మధ్యలోనే ఆపేశారు..! మావల్ల కాదని చేతులెత్తేసిన డాక్టర్లు. ఆ తరువాత ఏమైందంటే..వీడియో.
చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలి కాలుకు జరుగుతున్న ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపారు. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన 62 ఏళ్ల పుష్పమ్మ గతేడాది
చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలి కాలుకు జరుగుతున్న ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపారు. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన 62 ఏళ్ల పుష్పమ్మ గతేడాది డిసెంబరు 31న ఇంట్లో జారిపడి తొడ ఎముక వద్ద గట్టిగా తగలడంతో కుటుంబ సభ్యులు ఈ నెల నాలుగో తేదీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బీపీ, షుగర్ పరీక్షలు చేసి కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.విరిగిన ఎముక ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పి తేదీ సైతం చెప్పారు. కాగా వృద్ధురాలిని ఆపరేషన్ గదికి తీసుకెళ్లాక.. పలు కారణాలు చెప్పి వాయిదా వేసి బుధవారం శస్త్రచికిత్స ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. తొడ భాగాన్ని కోసిన వైద్యులు మధ్యలోనే కుట్లు వేసి.. చికిత్స చేయలేమని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు ప్రశ్నిస్తే ఎముకలు గట్టిగా లేవని వైద్యులు చెప్పడంతో వారు ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను సంబంధిత వైద్యులతో మాట్లాడతానని, న్యాయం చేస్తానని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. ఆపై బాధితురాలిని ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

