‘ ఉతుకో ఉతుకు !’ అదిరిందయ్యా చింప్ ‘ దంచుడు ‘ !

‘ నీ తెలివి తెల్లార ; అని ఎవరినైనా అంటే ఎదుటోడు తెల్ల మొహం వేయడం ఖాయం.. అంటే చెప్పింది అతగాడు ‘ అర్థం ‘ చేసుకోలేదని మరో ‘ అర్థం ‘. కానీ ఇక్కడ ఓ చింపాంజీ తెలివికి మాత్రం జోహార్లు అర్పించాల్సిందే. జస్ట్ తాను చూసింది చూసి అలాగే బిహేవ్ చేసిందది.. . జూ కీపర్ ఓ చిన్న నీటి బేసిన్ లో బట్టలు ఉతకడం చూసిందట అది ! అంతే ! నీ […]

' ఉతుకో ఉతుకు !' అదిరిందయ్యా చింప్ ' దంచుడు ' !
Pardhasaradhi Peri

|

Dec 10, 2019 | 7:35 PM

‘ నీ తెలివి తెల్లార ; అని ఎవరినైనా అంటే ఎదుటోడు తెల్ల మొహం వేయడం ఖాయం.. అంటే చెప్పింది అతగాడు ‘ అర్థం ‘ చేసుకోలేదని మరో ‘ అర్థం ‘. కానీ ఇక్కడ ఓ చింపాంజీ తెలివికి మాత్రం జోహార్లు అర్పించాల్సిందే. జస్ట్ తాను చూసింది చూసి అలాగే బిహేవ్ చేసిందది.. . జూ కీపర్ ఓ చిన్న నీటి బేసిన్ లో బట్టలు ఉతకడం చూసిందట అది ! అంతే ! నీ తెలివికి నేనూ తీసిపోనంటూ ఓ టీ-షర్టును ఎంచక్కా ఉతికిపారేసింది. ఒక బ్రష్, బార్ సోప్ తో ఆ చింప్ మరో వాటర్ బేసిన్ లో ఆ షర్టును ఉతికిన వీడియో వావ్ అనిపిస్తోంది. 18 ఏళ్ళ మగ చింపాంజీ అయిన ‘ యూహీ ‘ అనే ఈ జీవి ఇంత తెలివైనదని తానూ అనుకోలేదని అంటోంది ఆ జూ నిర్వాహకురాలు.. ఆ బేసిన్ వద్ద ఈ టీ షర్టును, బ్రష్, సోప్ ను ఉంచి తానటు వెళ్ళగానే ఇది వాష్ చేయడం చూసి చాలా ఆశ్చర్యపోయానని ఆమె చెబుతోంది. చైనాలోని ఓ థీమ్ పార్కులో జరిగిన ఈ తతంగం తాలూకు వీడియోకు వేలాది వ్యూస్, లైకులు వచ్చాయట. మరెందుకింక ఆలస్యం.. మనమూ చూసేద్దాం !

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu