కాలనాగుల విషం.. పాముకాటు బాధితులకు వరం

కాలనాగు సర్పాల కాట్లకు ఎంతోమంది బలవుతున్నారు. వీటి విషం శరీరాల్లోకి ఎక్కిన వెంటనే క్షణాల్లో మృత్యుముఖం పడుతున్నారు. అయితే వెంటనే యాంటీ వీనమ్ ఇంజెక్షన్, ఇతర మందులను ఇఛ్చిన పక్షంలో బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చునని అంటున్నారు. ఉదాహరణకు బ్రెజిల్ లో కేవలం ఒక్క గత ఏడాదిలోనే 29 వేలమంది పాము కాటుకు గురయ్యారని అంచనా. అధికారిక సమాచారం ప్రకారం వందమంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాంటీ వీనమ్ తయారీ లో నిపుణురాలైన ఫాబియోలా […]

కాలనాగుల విషం.. పాముకాటు బాధితులకు వరం
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 10, 2019 | 1:10 PM

కాలనాగు సర్పాల కాట్లకు ఎంతోమంది బలవుతున్నారు. వీటి విషం శరీరాల్లోకి ఎక్కిన వెంటనే క్షణాల్లో మృత్యుముఖం పడుతున్నారు. అయితే వెంటనే యాంటీ వీనమ్ ఇంజెక్షన్, ఇతర మందులను ఇఛ్చిన పక్షంలో బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చునని అంటున్నారు. ఉదాహరణకు బ్రెజిల్ లో కేవలం ఒక్క గత ఏడాదిలోనే 29 వేలమంది పాము కాటుకు గురయ్యారని అంచనా. అధికారిక సమాచారం ప్రకారం వందమంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాంటీ వీనమ్ తయారీ లో నిపుణురాలైన ఫాబియోలా డిసౌజా అనే నిపుణురాలు సావో పాలో లోని ఓ ఇన్స్ టిట్యూట్లో వందలాది పాముల విషాన్నితీసి సీసాల్లో భద్రపరుస్తున్నారు. అత్యంత విషనాగులనుంచి కూడా పాయిజన్ తీయడంలో ఆమె ఎంతో నైపుణ్యం సాధించారు. ఒక పామును 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల గది లో.. ఓ స్టెయిన్ లెస్ స్టీల్ బెంచ్ పై ఉంచి అతి లాఘవంగా.. కార్బన్ డై ఆక్సైడ్ తో కూడిన బాటిల్ లోకి విషాన్ని తీస్తున్నామని, ఈ వాయువు కారణంగా సర్పం నిద్రలోకి జారుకుంటుందని ఆమె చెప్పారు. పాము విషం కక్కిన అనంతరం దాని బరువును, పొడవును రికార్డు చేసి అనంతరం దాన్ని ఓ కంటెయినర్ లో ఉంచుతామన్నారు. ఇక్కడితో ‘ కథ ‘ అయిపోలేదు. పాము విషాన్ని కొద్దీ మోతాదులో గుర్రాలకు ఎక్కిస్తారట. ఆ తరువాత ఈ యాంటీ వీనమ్ ఇంజెక్షన్లను వాటికి ఇస్తారని, వాటికి ప్రాణాపాయం లేదని నిర్ధారించుకున్న అనంతరం వైద్య పరీక్షల్లో వాడుతామని ఆమె చెప్పారు. కొన్ని ఇతర మందులతో కలిపి దీన్నిఆస్పత్రులకు  సరఫరా చేస్తారు. కాగా- నెలకు ఒక్కసారి మాత్రమే పాము విషాన్ని తీయడం ఈ పరిశోధనల్లో ఓ ప్రత్యేకత.

రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..