AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు వ్యాపారులే టార్గెట్‌.. షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం! వీడియో చూడండి..

సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో కొత్త కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా UPI QR కోడ్‌ స్టిక్కర్లతో చిన్న వ్యాపారులను ఎలా మోసం చేయొచ్చో చూపించే ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..

చిరు వ్యాపారులే టార్గెట్‌.. షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం! వీడియో చూడండి..
UPI QR Code Scam
Srilakshmi C
|

Updated on: Aug 28, 2026 | 9:37 PM

Share

ఈ వీడియోలో ఇద్దరు యువకులు చిన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దుకాణదారుడికి తెలియకుండా అతని అసలు UPI QR కోడ్‌పై దాని స్థానంలో తమకు సంబంధించిన QR కోడ్‌ స్టిక్కర్‌ను అతికించడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత కస్టమర్లు ఆ QR కోడ్‌ను స్కాన్‌ చేసి చెల్లింపులు చేస్తే.. ఆ నగదు అసలు వ్యాపారి ఖాతాలో కాకుండా మోసగాళ్లు నియంత్రించే ఖాతాకు వెళ్లే ప్రమాదం ఉందని వీడియో ద్వారా అవగాహన కల్పించారు.

ఈ వీడియో అసలు సృష్టికర్త ఎవరనేది స్పష్టంగా తెలియకపోయినా మురళీధరన్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో ఉద్దేశం మోసం చేయడం కంటే ఇలాంటి మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే అని చెబుతున్నారు. అయితే ఇలాంటి వీడియోలను చూసి ఎవరూ స్వయంగా ఈ పద్ధతిని ప్రయత్నించకూడదని, డిజిటల్‌ చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వ్యాపారులు ఏం చేయాలి?

QR కోడ్‌ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న దుకాణదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

  • QR కోడ్‌ స్టిక్కర్‌ను తరచూ పరిశీలించాలి.
  • QR కోడ్‌ మారిపోయిందేమో చెక్‌ చేయాలి.
  • ప్రతి చెల్లింపు తర్వాత తమ బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ అయిందా లేదా ధ్రువీకరించుకోవాలి.
  • కేవలం కస్టమర్‌ చూపించే ‘Payment Successful’ స్క్రీన్‌ను మాత్రమే నమ్మకూడదు.
  • అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి.
  • అనుమానం ఉన్న సందర్భాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

QR కోడ్‌ స్కాన్‌ చేసే కస్టమర్లూ జాగ్రత్త!

ఇలాంటి మోసాల్లో వ్యాపారులతో పాటు కస్టమర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చెల్లింపు చేసే ముందు QR కోడ్‌ పేరు, UPI ID, చెల్లింపు గ్రహీత వివరాలను పరిశీలించడం మంచిది. డిజిటల్‌ చెల్లింపులు సౌకర్యవంతమైనవే అయినప్పటికీ.. అప్రమత్తత లేకపోతే మోసాలకు అవకాశం ఉంటుంది. అందుకే QR కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లించే ముందు వివరాలు చెక్‌ చేయడం, చెల్లింపు పూర్తయిన తర్వాత లావాదేవీని ధ్రువీకరించుకోవడం అత్యంత ముఖ్యం. సులభమైన డిజిటల్‌ చెల్లింపులతో పాటు.. చిన్నపాటి జాగ్రత్తలు కూడా పాటిస్తే ఇలాంటి మోసాలకు చెక్‌ పెట్టవచ్చు.

Follow Us
షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం.. వీడియో చూడండి
షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం.. వీడియో చూడండి
రయ్ అంటూ దూసుకెళ్తున్న కారు.. పోలీసులు ఆపగా బయటపడ్డ ట్విస్ట్
రయ్ అంటూ దూసుకెళ్తున్న కారు.. పోలీసులు ఆపగా బయటపడ్డ ట్విస్ట్
మల్లి ఇది నువ్వేనా? RRR ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎలా మారిపోయిందో చూశారా?
మల్లి ఇది నువ్వేనా? RRR ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎలా మారిపోయిందో చూశారా?
నాకు సినిమాలు వద్దు.. మా ఊరు వెళ్లిపోతానని ఆ హీరోయిన్ ఏడ్చింది..
నాకు సినిమాలు వద్దు.. మా ఊరు వెళ్లిపోతానని ఆ హీరోయిన్ ఏడ్చింది..
భార్య కోసం తాత నిరంతర పోరాటం.. ఇంతలో ట్విస్ట్
భార్య కోసం తాత నిరంతర పోరాటం.. ఇంతలో ట్విస్ట్
ఇంట్లో పూర్వీకుల ఫొటో ఉందా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
ఇంట్లో పూర్వీకుల ఫొటో ఉందా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నేపాల్ వరదల్లో భయానక దృశ్యం: బాల్కనీలో చిక్కుకుపోయిన కుటుంబం!
నేపాల్ వరదల్లో భయానక దృశ్యం: బాల్కనీలో చిక్కుకుపోయిన కుటుంబం!
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి సూపర్ న్యూస్
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి సూపర్ న్యూస్
రాష్ట్రంలో 15,982 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబరులోగా నియామకాలు
రాష్ట్రంలో 15,982 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబరులోగా నియామకాలు
10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ..
10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ..