Viral Video :స్మశానవాటికలో కాలుతున్న మృతదేహాల మధ్య నిద్రపోతున్న వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే..

స్మశానవాటికలో మండుతున్న చితి పక్కన ఒక వృద్ధుడు పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ఈ దృశ్యం కనిపించింది కూడా ఓ అర్థరాత్రి. అక్కడ అతను తప్ప మొత్తం ఘాట్‌లో ఒక్క వ్యక్తి కూడా కనిపించటం లేదు. ఇది అందరికీ ఆశ్చర్యం, షాక్‌కు గురిచేసే వార్త అనే చెప్పాలి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దాని వెనుక ఉన్న కారణం హృదయాన్ని కదిలిస్తుంది.

Viral Video :స్మశానవాటికలో కాలుతున్న మృతదేహాల మధ్య నిద్రపోతున్న వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే..
Old Man Sleeps
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 31, 2023 | 3:04 PM

సాధారణంగా, హిందూ మతంలో ఎవరైనా చనిపోతే అతని మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లి దహనం చేస్తారు. అక్కడి నిశ్శబ్ధ వాతావరణంలో మృతుని కుటుంబ సభ్యుల రోదన ఒక్కటే వినిపిస్తుంది. స్మశాన నిశ్శబ్ధం నిజంగా భయానకంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశంలో మృతదేహం కాలుతున్న చితి పక్కన ఎవరైనా సాహసం చేసి నిద్రపోగలరా..? కానీ, ఇదే జరిగింది ఒక చోట. స్మశానవాటికలో మండుతున్న చితి పక్కన ఒక వృద్ధుడు పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు కూడా. ఈ దృశ్యం కనిపించింది కూడా ఓ అర్థరాత్రి. అక్కడ అతను తప్ప మొత్తం ఘాట్‌లో ఒక్క వ్యక్తి కూడా కనిపించటం లేదు. ఇది అందరికీ ఆశ్చర్యం, షాక్‌కు గురిచేసే వార్త అనే చెప్పాలి.  కాన్పూర్లో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దాని వెనుక ఉన్న కారణం హృదయాన్ని కదిలిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో కాన్పూర్‌కు చెందినదిగా తెలిసింది. ఇందులో శ్మశాన వాటికలో కాలుతున్న చితి పక్కనే ఓ వృద్ధుడు పడుకుని నిద్రిస్తున్నాడు. ఈ దృశ్యం అర్థరాత్రి జరిగింది. అతను తప్ప, మొత్తం ఘాట్‌లో ఒక్క వ్యక్తి కూడా కనిపించటం లేదు.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా ప్రజలు శ్మశానవాటికకు వెళ్లడానికి కూడా భయపడతారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం కాలిపోతున్న మృతదేహం పక్కన ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు అర్థం కాక జనం ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

సమాచారం ప్రకారం, ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని కోహ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవ్ ఘాట్‌కు చెందినదిగా తెలిసింది. దేశంలోని అనేక ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా ఈ సమయంలో విపరీతమైన చలి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వృద్ధుడికి సన్నటి దుప్పటి మాత్రమే ఉంది. చలి నుండి తనను తాను రక్షించుకోవడానికి కాలిపోతున్న మృతదేహాన్ని ఆశ్రయించటం తప్ప వేరే మార్గం కనిపించలేదు. మండుతున్న చితి తాపంతో ఆ వృద్ధుడు చలి తీవ్రతను నుంచి తప్పించుకుంటున్నాడు. కాన్పూర్‌లో ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 8 నుండి 9 డిగ్రీల వరకు ఉంటుందని సమాచారం.

పక్కనే నిల్చున్న వ్యక్తులు వృద్ధుడిని వీడియో తీసి ఇక్కడ ఎందుకు పడుకున్నారని అడగ్గా.. చలిగా ఉండటంతో వచ్చి ఇక్కడే పడుకున్నానని వృద్ధుడు చెప్పాడు. వృద్ధుడి ఈ మాటలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఇలాంటి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసేందుకు ఎంతోమంది దాతలు కృషి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కనీస సౌకర్యాలు అందక చలిలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారని ఈ వీడియో చూస్తేనే అర్థం అవుతుంది. అయితే, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వీడియో షేర్‌ చేసిన వ్యక్తిని, వీడియో తీసిన వ్యక్తిపై మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..