Viral Video: వధువుకి 27 ఏళ్ళు.. వరుడికి 72 ఏళ్లు.. హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు
భారతీయులు విదేశీ యువతీ యువకులను ప్రేమించి.. పెద్దల అనుమతితో హిందూ సంప్రదాయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్ళిళ్ళు ప్రస్తుతం సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఇప్పుడు ఒక పెళ్ళికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ పెళ్లి స్పెషల్ ఏమిటంటే.. వధువుకి 27 ఏళ్లు.. వరుడికి 72 ఏళ్లు. ఈ దంపతులు విదేశాలకు చెందిన వారు. 72ఏళ్ల వరుడు రాజవంశపు షేర్వాణీ, కాషాయ తలపాగా, రత్నాల చిహ్నం ధరించి గుర్రంపై రావడంతో వివాహం ప్రారంభమైంది. జోధ్‌పూర్‌లోని అందమైన ఖాస్ బాగ్‌లో సాంప్రదాయంగా నుదుట తిలకం దిద్ది స్వాగతం చెప్పారు.

రాజస్థాన్‌లోని “సూర్య నగరం” అయిన జోధ్‌పూర్‌లో మరోసారి భారతదేశ గొప్ప సంప్రదాయాలకు ప్రాణం పోసే విధంగా రాజరిక సాంప్రదాయంలో వివాహం జరిగింది. అయితే ఇలా పెళ్లి చేసుకున్న వధూవరులు భారతీయులు కాదు.. ఉక్రెయిన్‌కు చెందినవారు. 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్ .. 27 ఏళ్ల వధువు అన్హెలినా హిందూ వేద సంప్రదాయాలను ఇష్టపడ్డారు. భారతీయ సంప్రదాయాలను స్వీకరించి తమ పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. జోధ్‌పూర్‌లోని అందమైన ఖాస్ బాగ్‌లో ఈ వధూ వరులు సప్త పదితో పెళ్లినాటి ప్రమాణాలు చేశారు. దండలు మార్చుకున్నారు. ఈ వివాహం రెండు విభిన్న సంస్కృతుల ప్రత్యేక మిశ్రమంగా నిల్చింది. భారతీయ ఆచారాలలో జరిగిన చిరస్మరణీయమైన రాజరిక వివాహం.
ఈ జంట ఉక్రెయిన్‌లో మూడు-నాలుగు సంవత్సరాలు సహజీవనం చేశారు. భారతీయ సంస్కృతిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత.. ఇష్టపడ్డారు. తమ సాంప్రదాయ భారతీయ ఆచారాలు, చిహ్నాలతో నిండిన రాజరిక వివాహాన్ని జరుపుకునేలా ప్లాన్ చేశారు.
ఆ జంట జోధ్‌పూర్‌లో ఎందుకు వివాహం చేసుకున్నారు?
ఉక్రెయిన్ నుంచి భారత దేశ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జైపూర్, ఉదయపూర్, జోధ్‌పూర్‌లను సందర్శించారు. ఆ తర్వాత ఆ జంట తమ వివాహానికి వేదికగా జోధ్‌పూర్‌ను ఎంచుకున్నారు. ఈ నగరం రాజరిక ఆకర్షణ, ప్రసిద్ధ మెహ్రాన్‌గఢ్ కోట, చారిత్రక ప్రదేశాలు, రంగురంగుల మార్కెట్లతో ఎల్లప్పుడూ విదేశీ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. వివాహ నిర్వాహకులు రోహిత్ , దీపక్ మాట్లాడుతూ.. వధువు అన్హెలినా భారతీయ ఆచారాలకు బాగా ప్రభావితమైందని అన్నారు. ఈ జంట పెళ్లి సమయంలో చేసే ప్రతి ఆచారాన్ని పూర్తి నిజాయితీ, సంప్రదాయంతో నిర్వహించాలని కోరుకున్నారు. దీంతో భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి జోధ్‌పూర్‌లోని అద్భుతమైన పరిసరాలలో.. తమ వివాహాన్ని చిరస్మరణీయమైన, రాజ పద్ధతిలో జరుపుకున్నారు స్టానిస్లావ్ అన్హెలినాలు
వీడియో ఇక్కడ చూడండి
View this post on Instagram
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




