AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఇదేక్కడి విడ్డూరం..! ‘మిస్టర్ రైట్’ దొరకలేదని తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ..

సెప్టెంబర్ 30న జరిగిన వేడుకకు సారా 40 మంది సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. రోజంతా అందరూ సరదాగా, సంతోషంగా ఎంజాయ్‌ చేశారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని వారందరూ కోరుకుంటున్నారని సారా తెలిపింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వార్నీ.. ఇదేక్కడి విడ్డూరం..! 'మిస్టర్ రైట్' దొరకలేదని తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ..
London Woman Marries
Jyothi Gadda
|

Updated on: Oct 15, 2023 | 1:07 PM

Share

పెళ్లి చేసుకోవాలనుకునే భాగస్వామిపై అంచనాలు ఉండటం సహజం. అయితే కొందరి అంచనాలు చాలా త్వరగా నెరవేరుతాయి. మరికొందరికి ఎక్కువ కాలం పడుతుంది. ‘మిస్టర్ రైట్’ కోసం లండన్‌లో ఓ మహిళ ఎదురుచూసి విసిగిపోయిందన్నది నిజం. కానీ నిరాశ చెందలేదు. చివరకు తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ వివాహానికి రూ. 10 లక్షలు ఖర్చు చేసింది. తన ఆదర్శ వివాహం కోసం ప్రతినెలా తాను పెట్టుకున్న పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. ఆమె పేరు సారా విల్కిన్సన్ వయసు 42 ఏళ్లు. ఇలా తన పెళ్లిని ఘనంగా నిర్వహించాలనే కోరికను ఆమె నెరవేర్చుకుంది.

సారా తనను తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె నిశ్చితార్థపు ఉంగరాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత పెళ్లికి సిద్ధమైంది. ఆమె ఫెలిక్స్‌స్టో, సఫోల్క్‌లోని హార్వెస్ట్ హౌస్‌లో స్నేహితులతో కలిసి తన పెళ్లి రోజును ప్రత్యేకంగా జరుపుకుంది. ఈ సందర్బంగా సారా మాట్లాడుతూ,..ఈ వేడుక అధికారిక వివాహం కాదు, నా పెళ్లి రోజు. నా భాగస్వామి నా పక్కన లేరన్నది నిజం. కానీ నేను పెళ్లి చేసుకోవాలనే కోరికను ఎందుకు వదిలేసుకోవాలి.. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి..? అందుకే డబ్బు ఆదా చేశాను. నేను పొదుపు చేసిన దాని కోసం ఆ డబ్బును ఖర్చు చేశాను’ అని సారా చెప్పింది.

సెప్టెంబర్ 30న జరిగిన వేడుకకు సారా 40 మంది సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. రోజంతా అందరూ సరదాగా, సంతోషంగా ఎంజాయ్‌ చేశారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని వారందరూ కోరుకుంటున్నారని సారా తెలిపింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె ఆలోచనను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..