African Man 55 Years Isolation: ఇదో వింత రోగం..! మహిళలంటే భయం.. ఆడవాళ్లను చూస్తే ఊపిరాడదు.. 55 ఏళ్లుగా..
71 ఏళ్ల వృద్ధుడు మహిళల పట్ల విపరీతమైన భయాందోళనకు గురవుతున్నాడు...దాంతో అతడు గత 55 సంవత్సరాలుగా తన ఇంట్లో తనను తాను బంధీగా చేసుకున్నాడు. 71 ఏళ్ల కాలిట్‌క్సే న్జామ్‌వితా స్త్రీలంటే భయంతో 16 ఏళ్ల నుంచి అంటే 55 ఏళ్లుగా ఇంట్లోనే తాళం వేసుకుని ఉంటున్నాడు. అంతేకాదు.. మహిళలు తనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సమీపానికి రాకూడదనే ఉద్దేశ్యంతో తన ఇంటి చుట్టూ 15 అడుగుల మేర కంచెను ఏర్పాటు చేసుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వింత భయాలు ఉంటాయి. మనలో చాలా మందికి జంతువులు, నీరు, అగ్ని లేదా చీకటి అంటే భయపడతారు. కొందరికి నీళ్లంటే భయం, కొందరికి దుమ్ము,దూళి, మరికొందరికి మనుషులను కలవాలంటే భయం. అదేవిధంగా, దక్షిణాఫ్రికాలోని రువాండాకు చెందిన ఒక వ్యక్తికి ఎక్కడ చూడని వింత భయం పట్టుకుంది. దాంతో అతడు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం చర్చకు వార్తగా నిలిచాడు. 71 ఏళ్ల వృద్ధుడు మహిళల పట్ల విపరీతమైన భయాందోళనకు గురవుతున్నాడు…దాంతో అతడు గత 55 సంవత్సరాలుగా తన ఇంట్లో తనను తాను బంధీగా చేసుకున్నాడు. 71 ఏళ్ల కాలిట్‌క్సే న్జామ్‌వితా స్త్రీలంటే భయంతో 16 ఏళ్ల నుంచి అంటే 55 ఏళ్లుగా ఇంట్లోనే తాళం వేసుకుని ఉంటున్నాడు. అంతేకాదు.. మహిళలు తనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సమీపానికి రాకూడదనే ఉద్దేశ్యంతో తన ఇంటి చుట్టూ 15 అడుగుల మేర కంచెను ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ మనిషికి ఆడవాళ్ళంటే భయంతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు.. కాలిటెక్స్ ఇంట్లోంచి బయటికి రావడం ఎవరూ చూడలేదు. చిన్నప్పటి నుంచి పిరికివాడని, ఇంట్లో నుంచి బయటకు రాడని అక్కడి స్థానిక పెద్దలు చెబుతున్నారు. తనకు ఎంత భయమో కాలిట్క్స్ చెప్పినట్లు దక్షిణాఫ్రికా మీడియా పేర్కొంది. విచిత్రం ఏమిటంటే, అతనికి ఆడవాళ్ళంటే భయం ఉన్నా, అతనికి భోజనం పెట్టేది మాత్రం ఆడవాళ్లే. అతనికి స్రీలంటే భయం, అయిష్టం కారణంగా వారిని అతడు దగ్గరికి రావడానికి ఇష్టపడడు. కాబట్టి, అతనికి కావాల్సిన వస్తువులను దూరం నుంచి విసిరేస్తారట. ఆపై అతను వచ్చి వాటిని తీసుకుంటాడు. ఆడవాళ్లను తన దగ్గరికి రానివ్వడు, కానీ ఆడవాళ్లు అతనికి ఏది ఇచ్చినా అతను దూరం నుండి తీసుకొని తింటాడు.
కాలిటెక్స్ గైనోఫోబియా అనే మానసిక స్థితితో బాధపడుతున్నాడని తెలిసింది. ఫోబియా అనేది ఫొబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్ అంటే భయం. వాస్తవానికి భయం నుంచి మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, తీవ్రంగా భయపడిపోవడం మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. గైనోఫోబియా లక్షణాలు స్త్రీలను తలచుకుంటేనే విపరీతమైన భయాన్ని కలిగిస్తుంది. ఈ ఫోబియాతో బాధపడేవారికి తీవ్ర భయాందోళనలు, గుండెకొట్టుకోవటం, అధిక చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..