Viral Video: మెట్రో రైల్లో సీటు కోసం కోట్లాడుకున్న అమ్మాయిలు.. కట్ చేస్తే..
అందులో ఒకరు ప్లేస్ లేదు అని అరుస్తుండగా.. మరో అమ్మాయి చాలా స్థలం ఉందంటూ బదులిస్తుంది. ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైల్లో జరిగినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి గొడవ మాత్రం అక్కడున్న వారికి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
బస్సు సీటు కోసం.. రైల్లో సీటు కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగడం చూస్తుంటాం. కొన్నిసార్లు మాటలతో ముగిసే వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి గొడవలకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు మహిళలు మెట్రోలో సీటు కోసం గొడవ పడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఒకరు ప్లేస్ లేదు అని అరుస్తుండగా.. మరో అమ్మాయి చాలా స్థలం ఉందంటూ బదులిస్తుంది. ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైల్లో జరిగినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి గొడవ మాత్రం అక్కడున్న వారికి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలోని మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళలు వాదించుకుంటున్నారు. అందులో పసుపు రంగు చీరలో ఉన్న స్త్రీ తన బ్యాగుతోపాటు సీట్లో కూర్చొని అక్కడి వచ్చిన మరో మహిళ తనకు ఖాళీ సీటు ఇవ్వమని అడిగింది. దీంతో తన పక్కన స్థలం లేదని సదరు మహిళ చెప్పగా.. ఇద్దరి మధ్య గొడవ నెలకొంది. సీటు ఖాళీ లేదని ఒళ్లో కూర్చొపెట్టుకోను అంటూ సదరు మహిళ వాదిస్తుండగా.. జీన్స్ ధరించిన అమ్మాయి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుంది. వీరిద్ధరి మధ్య జరిగిన సంభాషణ చూసి స్థానికంగా ఉన్నవారు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
“Nhi jagh hai – bout jagh hai” Female Version ? pic.twitter.com/ePcJkHEAe8
— Wellu (@Wellutwt) August 13, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.