Viral Video: ఇరగదీశారు అంతే.. నెట్టింట దుమ్మురేపుతున్న ఇద్దరు వైద్యుల డ్యాన్స్‌.. షేర్ చేసిన ఆరోగ్య మంత్రి..

వయనాడ్‌లోని నల్లూరునాడు ట్రైబల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సవన్‌ సరా మ్యాథ్యూ, మెడికల్ ఆఫీసర్‌ డా.సఫిజ్‌ అలీ ఇద్దరు కలిసి ఆ పాటకు స్టెప్పులేయడం విశేషం.

Viral Video: ఇరగదీశారు అంతే.. నెట్టింట దుమ్మురేపుతున్న ఇద్దరు వైద్యుల డ్యాన్స్‌.. షేర్ చేసిన ఆరోగ్య మంత్రి..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 15, 2022 | 5:30 PM

Kerala Doctors Dance Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. కేరళకు చెందిన ఇద్దరు వైద్యులు చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మధ్యే విడుదలైన పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘కడువ’ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘పాలా పల్లి తిరుపల్లి’ పాటకు వారిద్దరు కలిసి స్టెప్పులేశారు. వయనాడ్‌లోని నల్లూరునాడు ట్రైబల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సవన్‌ సరా మ్యాథ్యూ, మెడికల్ ఆఫీసర్‌ డా.సఫిజ్‌ అలీ ఇద్దరు కలిసి ఆ పాటకు స్టెప్పులేయడం విశేషం. ఇది సోషల్ మీడియాలో వచ్చిరాగానే అందరికీ ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు పలు కామెంట్లు చేస్తున్నారు.

కాగా.. ఇద్దరు డాక్టర్లు డాన్స్ చేస్తున్న వీడియోను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసి.. వైద్యులను ప్రశంసించారు. డా.సరా మ్యాథ్యూ, డా.సఫిజ్‌ అలీ ఇద్దరూ అత్యుత్తమ వైద్యులని.. అలాగే మంచి డ్యాన్సర్లంటూ కొనియాడారు. ఆ ఆసుపత్రి సిబ్బంది వేలాది మంది రోగులకు ఉత్తమ సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

వైరల్ వీడియో

ఇవి కూడా చదవండి

కాగా.. కడువ సినిమాలోని ‘పాలపల్లి తిరుపల్లి..’ అంటూ మొదలయ్యే ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది ఈ పాటకు రీల్స్, డ్యాన్స్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?