Viral Video: అందుకే బ్రదర్ అమ్మాయిలను గుడ్డిగా నమ్మకూడదు.. మనసు ముక్కలైందిగా
ప్రేమ.. ఈ రెండక్షరాలు ఎంతో మ్యాజిక్ చేస్తాయి. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి.. బహుశా ఈ ప్రపంచంలో ప్రేమలో పడని వారంటూ ఉండరేమో.
Viral Video: ప్రేమ.. ఈ రెండక్షరాలు ఎంతో మ్యాజిక్ చేస్తాయి. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి.. బహుశా ఈ ప్రపంచంలో ప్రేమలో పడని వారంటూ ఉండరేమో. ప్రేమ సక్సెస్ అయితే ఓ అందమైన కథ అవుతుంది.. అదే ఫెయిల్ అయితే ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇక ప్రేమ అనేది మనుషులోనే కాదు జంతువుల్లోనూ ఉంటుంది. అదేవిధంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే ఆ భాద ఎలా ఉంటుందో వర్ణించడం కష్టమే.. సినిమాల్లో చూపించిందానికంటే ఎక్కువ భాద ఉంటుంది. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం అందుకు రివర్స్ లో ఉంది. ఇక్కడ ఓ ప్రేమికుడి మనసు ముక్కలైతే మనకు మాత్రం నవ్వొస్తుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో లవ్ ఫెయిల్ అయ్యింది మనిషికి కాదు ఒక పిల్లికి. ఈ వీడియోలో రెండు పిల్లులు ప్రేమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ ప్రేమలో మునిగిపోగా..అక్కడికి ఆ ఆడ పిల్లి మరో ప్రేమికుడు వచ్చాడు. తాను ప్రేమించిన పిల్లి మరో పిల్లితో ఉండటం చూసి ఆ ప్రేమికుడి గుండె బద్దలయ్యింది. అసలైన ప్రేమికుడిని చూసిన ఆ ఆడపిల్ల ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోన్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..