Telugu News Trending Train journey at Doodhsagar Waterfalls video has gone viral in Social Media
Viral Video: ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. దూద్ సాగర్ అందాలతో తన్మయత్వం.. మనసు దోచుకుంటున్న దృశ్యాలు
ఇండియాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. పర్యాటకులు సందర్శించడానికి అనువైన, అందమైన ప్రదేశాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చటి మైదానాలు, అందమైన జలపాతాలు కోకొల్లలు. వర్షాకాలంలో వీటి అందం మరింత....
ఇండియాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. పర్యాటకులు సందర్శించడానికి అనువైన, అందమైన ప్రదేశాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చటి మైదానాలు, అందమైన జలపాతాలు కోకొల్లలు. వర్షాకాలంలో వీటి అందం మరింత పెరుగుతుంది. చిటపట చినుకులు కురిసే వేళల్లో ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అందుకే నేచర్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వీడియోలు మన మనసు దోచుకుంటాయి. వాటిని మనం చూడకుండా ఉండలేం. అలాగే చూస్తూ ఉండిపోతాం. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఎక్కడైనా టూర్ కు వెళ్లాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే ప్రదేశం గోవా. ప్రకృతి ప్రేమికుల నుంచి నైట్ లైఫ్ ప్రేమికుల వరకు ఇది సరైన గమ్యస్థానం. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడి అందాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఉన్న దూద్‌సాగర్..! గోవాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన జలపాతం. దీనిని చూసిన పర్యాటకులు ఇక్కడే స్వర్గం నెలకొందని ఫీల్ అవుతారు.
వైరల్ అవుతున్న వీడియోలో దూద్‌సాగర్ జలపాతం సమీపంలో రైలు ప్రయాణించడాన్ని చూడవచ్చు. జలపాతాన్ని చూస్తుంటే పర్వతాల నుంచి పాలధార వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది గోవా – బెల్గాం రైలు మార్గంలో ఉంది. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా చాలా అందంగా, అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. జలపాతంతో ప్రేమలో పడ్డానని, ప్రకృతి అందాలు చూడాలంటే దూద్ సాగర్ జలపాతం వద్దకు రావాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. ఈ జలపాతం చుట్టూ అడవులు ఉన్నాయి. అవి జలపాతం అందాన్ని మరింత పెంచింది.