Elephant – Calf: ఇది కదా ర్యాగింగ్ అంటే.. గజరాజునే భయపెట్టిన లేగదూడ.. ట్రెండ్ మార్చిన వీడియో..
సాధారణంగా పెద్ద జీవిని చూస్తే చిన్న జీవులు హడలిపోతాయి. అవి కనిపించడమే ఆలస్యం దూరంగా పారిపోతాయి. కానీ, ఇక్కడ ఓ లేగ దూడ మాత్రం గజరాజునే హడలెత్తించింది.
సాధారణంగా పెద్ద జీవిని చూస్తే చిన్న జీవులు హడలిపోతాయి. అవి కనిపించడమే ఆలస్యం దూరంగా పారిపోతాయి. కానీ, ఇక్కడ ఓ లేగ దూడ మాత్రం గజరాజునే హడలెత్తించింది. వెంటబడి మరీ పరుగెత్తించింది. కనీసం ఆ ఏనుగుకు మోకాలి ఎత్తు కూడా లేని ఆ లేగ దూడ.. ఏనుగును దారుణంగా ర్యాగింగ్ చేసింది. ఆ లేగ దూడ వెంట పడుతుంటే.. ఏనుగు దానికి ఎలాంటి హానీ తలపెట్టకుండా వెనక్కి వెనక్కి పరుగులు తీసింది. అయితే, ఆ లేగ దూడ వెనుకే దాని తల్లి కూడా ఉంది. ఆ తల్లి తన బిడ్డను వద్దు ఆ ఏనుగుజోలికి వెళ్లొద్దు అని వారిస్తున్నట్టుగా దాని వెంటే వెళ్తుంది. అయితే, ఇక్కడ ఏనుగు కూడా సరదాగా తీసుకున్నట్లుంది. అందుకే.. ఆ చిన్ని లేగదూడ బెదిరింపులకు తాను ఎంతో భయపడిపోయినట్లు నటించింది. ఆ తరువాత ఆ దూడ తల్లి ఇక చాల్లే పదా అంటూ అక్కడినుంచి తీసుకెళ్లిపోయింది. ఏనుగు తన దారిన తాను హ్యాపీగా వెళ్లిపోయింది.ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు. లేగ దూడ ర్యాగింగ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బ్యూటీఫుల్ సీన్ అంటూ మరికొందరు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

