UK PM: యుద్ధ విమానంలో చక్కర్లు కొడుతూ యుకె ప్రధాని సెల్ఫీ వీడియో.. నెటిజన్లు పైర్..! ఇంతకీ ఆ వీడియో ఎం ఉంది అంటే..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుద్ధవిమానంలో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్‌ను నడుపుతూ.. తనను అనుసరిస్తూ మరో రెండు విమానాలకు థంబ్స్ అప్ ఇవ్వడం వీడియోలో కనిపించింది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుద్ధవిమానంలో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్‌ను నడుపుతూ.. తనను అనుసరిస్తూ మరో రెండు విమానాలకు థంబ్స్ అప్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. ‘ప్రధాని బోరిస్ జాన్సన్ లింకన్‌షైర్‌లోని ఆర్‌ఏఎఫ్ కానింగ్స్‌బై నుంచి టైఫూన్ ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లో ఎగురుతున్నారు.’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. గత వారం లింకన్‌షైర్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో టైఫూన్ పైటర్స్ జెట్స్ ప్రదర్శన సందర్భంగా ఈ వీడియో తీసినట్లు ఐటీవీ ప్రసారం చేసింది. ఈ సందర్భంగా ఆ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన బోరిస్.. కొన్ని విన్యాసాలు చేసేందుకు విమానాన్ని నియంత్రించానంటూ పేర్కొన్నారు. ఫైటర్ జెట్‌లో ప్రయాణంపై వింగ్ కమాండర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు బోరిస్. మరోవైపు.. ఫైటర్ జెట్‌లో బోరిస్ ప్రయాణించటంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. టాప్ గన్ సినిమాలో టామ్ క్రూజ్ ఫీట్‌లు చేసేందుకు ప్రయత్నించారని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రధాని ఈ జాయ్‌రైడ్‌లో జాలీగా వెళ్లడానికి, టామ్ క్రూజ్‌లా విన్యాసాలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఎంత ఖర్చయిందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ రైడ్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటని మరొకరు ప్రశ్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

