Pink , Blue Sky: గులాబీ , బ్లూ రంగులో మారిన ఆకాశం..  అంటార్కిటికాలో షాకింగ్‌ అండ్ అద్భుత దృశ్యం..

Pink , Blue Sky: గులాబీ , బ్లూ రంగులో మారిన ఆకాశం.. అంటార్కిటికాలో షాకింగ్‌ అండ్ అద్భుత దృశ్యం..

Anil kumar poka

|

Updated on: Jul 22, 2022 | 9:40 AM

దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా ఆకాశం ఇలా గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకట్టుకుంటోంది. చేయి తిరిగిన కళాకారుడెవరో కాన్వాస్‌పై రంగులు అద్దినట్లుగా ఉన్న ఈ దృశ్యం


దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా ఆకాశం ఇలా గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకట్టుకుంటోంది. చేయి తిరిగిన కళాకారుడెవరో కాన్వాస్‌పై రంగులు అద్దినట్లుగా ఉన్న ఈ దృశ్యం ఆకాశంలో ప్రకృతి దిద్దుకున్న ముగ్ధ మనోహర దృశ్యం. ఆకాశంపై పరుచుకున్న వర్ణమాలిక ఫొటోలను అంటార్కిటికాలోని న్యూజిలాండ్‌ పరిశోధన కేంద్రం టెక్నీషియన్‌ స్టువర్ట్‌ షా క్లిక్‌మనిపించారు. కాగా.. గగనతల రంగుల వెనకున్న కారణం విచిత్రమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 15న అంటార్కిటికాకు సుమారు 7 వేల కిలోమీటర్ల దూరంలోని టోంగా దీవుల్లో ఉన్న సముద్రగర్భ అగ్నిపర్వతం బద్దలై ఏకంగా 58కి.మీ. ఎత్తుకు బూడిద, దుమ్ము, ధూళిని ఎగజిమ్మిందని చెప్పారు.ఐ దీంతో భూ వాతావరణంలోనే నేటికీ కలియతిరుగుతున్న ధూళి తుంపరల్లో కొన్ని సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో కాంతిని అడ్డుకున్నప్పుడు ఆకాశంలో ఇలా రంగురంగుల దృశ్యాలు కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వద్ద గగనతలంపై కనిపించినట్లు చెప్పారు. ఈ అగ్ని­పర్వత ధూళి తుంపరలు సుమారు రెండేళ్లపాటు భూ వాతావరణంలో ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 22, 2022 09:40 AM