Yamuna River: కాలుష్య కాసారంగా యమునా నది.. దడ పుట్టించే దృశ్యాలు ఇవిగో..

ఢిల్లీలోని కాళింది కుజ్ వద్ద ఈ ఏడాది కూడా పెద్దఎత్తున నురగ ఏర్పడింది. దేశ రాజధానిలో ఇప్పటికే వాయు నాణ్యత క్షీణించింది. ప్రస్తుతం యమునా నది కూడా కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Yamuna River: కాలుష్య కాసారంగా యమునా నది..  దడ పుట్టించే దృశ్యాలు ఇవిగో..
River Yamuna Is Polluted
Follow us

|

Updated on: Oct 18, 2024 | 12:29 PM

పెరుగుతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ పోరాటం కొనసాగిస్తుండగా శుక్రవారం కాళింది కుంజ్ ప్రాంతంలోని యమునా నదిపై విషపూరిత నురుగు తేలుతూ కనిపించింది. ఇది ఢిల్లీలో పెరుగుతున్న పర్యావరణ కష్టాలను మరింత రెట్టింపు చేస్తోంది. ఇది రోజువారీ దిగజారుతున్న గాలి నాణ్యత పట్ల ఆందోళన రేపుతోంది. దట్టమైన పొగమంచు ఢిల్లీని కప్పేసింది. మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 293కి పడిపోయింది.

ఈ వీడియో చూడండి..

మనదేశంలోని ముఖ్య నదుల్లో యమునా నది ఒకటి. పారిశ్రామిక వ్యర్థాలు, కలుషిత పదార్థాల వల్ల ప్రతి సంవత్సరం ఈ నదిలో విషపూరితమైన నురగ ఏర్పడుతుంటుంది. తాజాగా ఢిల్లీలోని కాళింది కుజ్ వద్ద ఈ ఏడాది కూడా పెద్దఎత్తున నురగ ఏర్పడింది. దేశ రాజధానిలో ఇప్పటికే వాయు నాణ్యత క్షీణించింది. ప్రస్తుతం యమునా నది కూడా కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..