AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బైక్‌పై అమ్మాయిల ట్రిపుల్ రైడింగ్‌.. నేరుగా ఎక్కడికి వెళ్లారో తెలిస్తే.. వాంతి చేసుకుంటారు..!

సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక అమ్మాయి బైక్‌ను నడిపింది. ఆమె వెనుక మరో ఇద్దరు స్నేహితులు కూర్చుని ఉన్నారు. ఈ ముగ్గురు నేరుగా వెళ్లి ఓ డ్రైనేజీలో పడిపోయారు. ఆ తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు. వాళ్లు పూర్తిగా డ్రైనీజీ మురికితో నిండిపోయారు. ఇలాంటి దృశ్యాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు.

Watch Video: బైక్‌పై అమ్మాయిల ట్రిపుల్ రైడింగ్‌.. నేరుగా ఎక్కడికి వెళ్లారో తెలిస్తే.. వాంతి చేసుకుంటారు..!
Girls Fell Into The Drain
Jyothi Gadda
|

Updated on: May 19, 2024 | 3:31 PM

Share

ఈ రోజుల్లో స్త్రీలు, పురుషుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదంటున్నారు. ఆడవాళ్లు కూడా అంచెలంచెలుగా మగవాళ్ళతో సమానంగా కలిసి నడుస్తున్నారు. మగవారికి ధీటుగా పలు వాహనాలు నడిపిస్తున్నారు. అంతేకాదు.. వారికి ఏ మాత్రం తీసిపోకుండా బైక్‌పై విన్యాసాలు కూడా చేస్తున్నారు. అలాగే, తామేందులోనూ తగ్గేదేలేదంటూ విచిత్ర స్టంట్స్ చేస్తూ కొన్నిసార్లు ప్రమాదాల బారినపడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు.

వైరల్‌ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు ఒకే బైక్‌పై ఎక్కడికో బయల్దేరారు. కానీ,పాపం వాళ్లు నేరుగా వెళ్లి అమాంతంగా ఒక డ్రైనేజీలో పడిపోయారు. తల నుంచి పాదాల వరకు శరీరమంతా డ్రైన్‌లోని చెత్తతో నిండిపోయింది. ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో వీడియోలో చూడొచ్చు. వారు పూర్తిగా ఆ బురదలో స్నానం చేసినట్టుగా కనిపిస్తున్నారు. అయితే, వీరి బైక్‌ ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమె బైక్‌ను కాలువలో నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో వీడియోలో చూపించనప్పటికీ, ప్రమాదం జరిగిన వీధిని చూస్తే ఎవరైనా వారిని ఢీకొట్టి పారిపోయి ఉంటారని అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @PalsSkit అనే ఐడితో షేర్ చేయబడింది. కేవలం 9 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించగా, వందల మంది వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. రోడ్డుపై డ్రెయిన్ ఎందుకు వేసారంటూ ఒక వినియోగదారు హాస్యాస్పదంగా వ్యాఖ్యనించారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. వారు ఆడవారు.. వారు ఏదైనా చేయగలరు.. మధ్యలో వచ్చిన కాలువది తప్పు అంటూ మరొకరు చమత్కరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..