Viral: 2 నెలల క్రితం కారు చోరీ.. ఒక్కసారిగా ఆన్ అయిన GPS.. వెంబడించగా…
2 నెలల క్రితం కారు మిస్ అయింది. ఎంత వెతికినా దొరకలే. ఒక్కసారిగా GPS సిగ్నల్ అందింది. ఇంకెమీ ఆలోచించకుండా మరో కారులో ఆ సిగ్నల్ ఫాలో అవ్వడం మొదలెట్టారు. కారులో ఏపీలో ఉన్నట్లు తేలింది. అక్కడి నుంచి తమిళనాడులోకి వెళ్తుండగా ఫాలో అయ్యారు. ఆ తర్వాత.....
వాహనం చోరీకి గురై రెండు నెలల అయింది. ఎంత వెతికినా అది కనిపించలేదు. కార్‌కు జీపీఎస్ ఉంది కానీ పని చేయలేదు. సరిగ్గా రెండు తర్వాత అకస్మాత్తుగా జీపీఎస్ నుంచి సిగ్నల్ వచ్చింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లగా పెద్ద బాగోతం వెలుగుచూసింది. ఆ డీటీల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన యు అస్కర్ (32) జనవరి 23, 2024న ఏడు సీట్ల కారును కొనుగోలు చేశాడు. ఫిబ్రవరి నెలాఖరులో త్రిసూర్‌కు చెందిన తన స్నేహితుడు కె నిబీష్ (38)కి కారును ఇచ్చాడు. అయితే మార్చి 2న కారు కనిపించకుండా పోవడంతో అస్కర్ త్రిసూర్ ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలో, కారులో అమర్చిన GPS పరికరాన్ని ఉపయోగించి తన వాహనాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. అయితే దాదాపు రెండు నెలల తర్వాత GPS నుంచి సిగ్నల్ అందింది. కారు ఆంధ్రప్రదేశ్‌లో ఉందని అతనికి మెసేజ్ వెళ్లింది. దీంతో అస్కర్ వెంటనే తన స్నేహితులతో కలిసి త్రిస్సూర్ నుండి కారులో బయలుదేరి, కారు వాడుతున్న వారిని వెంబడించడం ప్రారంభించాడు. కారు తమిళనాడు సరిహద్దులోకి ప్రవేశించి చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఉందని GPS ద్వారా తెలిసింది. దొంగిలించిన కారులో ఉన్న వారి కంటే ముందుగా పెరంబలూరు చేరుకుని.. హైవే పెట్రోలింగ్ పోలీసులను ఆశ్రయించి విషయం వివరించాడు. తన కారుకు సంబంధించిన డాక్యూమెంట్స్ అన్నీ చూపించాడు. దీంతో ఎస్సై ఎ రామరాజ్ నేతృత్వంలోని హైవే పెట్రోలింగ్ టీమ్ వెంటనే పెరంబలూరు జిల్లా వల్లాపురం సమీపంలో చెకింగ్ పాయింట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీని షూరు చేశారు. వారితో పాటు అస్కర్ కూడా అక్కడే కాసుకు కూర్చున్నాడు. ఇంతలో అతని కారు రానే వచ్చింది. అస్కర్ ఆ కారు తనదే అని పోలీసులు చెప్పాడు. పోలీసులు దాని అడ్డగించగా… కారులో నుంచి ఆరుగురు వ్యక్తుల్లో.. ముగ్గురు ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత కారు మొత్తం చెక్ చేయగా… ఐదుకిపైగా బండిల్స్‌లో గంజాయిని దాచి ఉన్నట్లు తేలింది. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ముగ్గురిని దొంగిలించిన కారుతో పాటు మంగళమేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పెరంబలూరు కొత్త బస్టాండ్‌లో పరారీలో ఉన్న మరో ముగ్గురిలో ఇద్దరిని పెరంబలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తేని జిల్లా కుంబమ్‌కు చెందిన ఎం.బాల (28), డి.మధన్ (29), అతని సోదరుడు డి.అజిత్ (27), జి. మనోజ్ (26), జె.ప్రభు (ఎ) ప్రతిభన్ (27)… 130 కిలోల గంజాయిని ఆంధ్రా నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన గంజాయి విలు రూ.13 లక్షలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. నిందితులపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..