సముద్రం అడుగున నిధి..! మహిళ డైవర్‌ చేయిపట్టి లాకెళ్లి చూపించిన ఆక్టోపస్‌.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఆక్టోపస్ తన దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని, తన వెంట రమ్మని కోరింది. అప్పుడు తను కూడా ఆక్టోపస్‌తో కలిసి నడవడం మొదలుపెట్టానని చెప్పింది. అంతేకాదు.. నేనూ తనతో నడుస్తున్నానా లేదా అని వెనక్కి తిరిగి చూసిన ఆక్టోపస్‌.. నేను తనను అనుసరిస్తున్నానని నిర్ధారించుకున్నాక, అది మళ్ళీ ముందుకు సాగడం ప్రారంభించింది. అలా సముద్రం అడుగు వరకు తీసుకెళ్లిన ఆక్టోపస్ తనను రెండు ఉక్కు స్తంభాల మధ్య కట్టి ఉన్న

సముద్రం అడుగున నిధి..! మహిళ డైవర్‌ చేయిపట్టి లాకెళ్లి చూపించిన ఆక్టోపస్‌.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Octopus
Follow us
Jyothi Gadda

|

Updated on: May 19, 2024 | 2:54 PM

సముద్రపు లోతుల్లో అనేక అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి మనుషులకు కూడా తెలియదు. అలాగే వందల సంవత్సరాల క్రితం, నిధులతో నిండిన ఓడలు నీటిలో మునిగిపోయాయని, వాటి గురించిన ఆనవాళ్లు ఇంతవరకు లభించలేదనే చారిత్రక కథలు కూడ అనేకం వింటుంటాం. అయితే, కొన్ని సార్లు ఈ నిధుల జాడ తెలిసినా కూడా గుర్తించటం కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒక మహిళా డైవర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఆమె మరో పనిమీద సముద్రంలోకి వెళ్ళింది. కానీ ఆమెకు తెలియకుండానే తను ఒక నిధిని కనుగొంది. అయితే, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తనకు ఆ నిధి జాగ చెప్పింది ఒక వింత సముద్ర జీవి అయిన ఆక్టోపస్. వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియా నివాసి జూల్స్ కేసీ సముద్రంలో డై వింగ్‌ కోసం వెళ్లింది. తనకు ఒక తెలివైన ఆక్టోపస్ కనిపించింది. అది ఆమె చేతిని పట్టుకుని సముద్రగర్భంలో దాగివున్న నిధి వైపు నడిపించింది. అది చూసిన జూల్స్ ఆశ్చర్యపోయింది. ఆక్టోపస్ తన చేతిని పట్టుకుని నీటి అడుగునకు తీసుకువెళ్లేందుకు పదేపదే ప్రయత్నిస్తోందని జూల్స్ నమ్మలేకపోయింది. అయితే, ఆక్టోపస్‌ ఆమె చేతిని పట్టుకుని తీసుకువెళ్తున్న అద్భుత దృశ్యాన్ని, అవార్డు గెలుచుకున్న ఒక ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు జూలీ వివరాలు వెల్లడిస్తూ..ఆక్టోపస్ తనను ఎక్కడికి తీసుకువెళ్తుందో తనకు తెలియదని, అయితే తాను ఖచ్చితంగా ఏదో సాహసం చేస్తున్నట్టుగా అనిపించిందని జూల్స్ చెప్పారు. ఆక్టోపస్ తన దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని, తన వెంట రమ్మని కోరింది. అప్పుడు తను కూడా ఆక్టోపస్‌తో కలిసి నడవడం మొదలుపెట్టానని చెప్పింది. అంతేకాదు.. నేనూ తనతో నడుస్తున్నానా లేదా అని వెనక్కి తిరిగి చూసిన ఆక్టోపస్‌.. నేను తనను అనుసరిస్తున్నానని నిర్ధారించుకున్నాక, అది మళ్ళీ ముందుకు సాగడం ప్రారంభించింది.

అలా సముద్రం అడుగు వరకు తీసుకెళ్లిన ఆక్టోపస్ తనను రెండు ఉక్కు స్తంభాల మధ్య కట్టి ఉన్న సమాధి వద్దకు తీసుకెళ్లినట్టుగా చెప్పింది. అది చూసిన తనకు పెద్ద షాక్ తగిలినంత పనైందని జూల్స్ చెప్పింది. ఆ సమాధి రాయిపై ఒక చిన్న తెల్ల కుక్కను పట్టుకున్న వ్యక్తి ఫోటో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమాధిని చూపించిన తర్వాత ఆక్టోపస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ సమాధిలో, చుట్టుపక్కల ఏ నిధి దాగి ఉందో జూల్స్ వెల్లడించలేదు. కానీ, ఆక్టోపస్ ఆమె చేయి పట్టుకుని ఆ సమాధి వద్దకు తీసుకెళ్లడం మాత్రం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో