Viral News: ఆ సిటీలో మాంసం తిన్నా, అమ్మినా కఠిన శిక్షలు వేస్తారు..

|

Dec 26, 2024 | 8:57 PM

ఈ మధ్య కాలంలో సందర్భం ఏదైనా సరే నాన్ వెజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆది వారం వచ్చిందంటే ఇంట్లో వారికి పండగే. అనేక రకాల నాన్ వెజ్ వంటలతో ఇళ్లల్లో నుంచి మంచి సువాసన వస్తుంది. కానీ ఈ నగరంలో మాత్రం మాంసాహారం తిన్నా, అమ్మినా కూడా నేరమే..

Viral News: ఆ సిటీలో మాంసం తిన్నా, అమ్మినా కఠిన శిక్షలు వేస్తారు..
Viral News
Follow us on

ముక్క లేనిదే ముద్ద దిగదు కొంత మందికి. సండే వచ్చిందంటే ఇంట్లో నాన్ వెజ్ జాతర చేస్తూ ఉంటారు. చికెన్, మటన్, ఫిష్ వంటి వాటిని ఓ పట్టు పడతారు. ఈ మధ్య అన్ని ఫంక్షన్స్‌కి కూడా నాన్ వెజ్ ఖచ్చితంగా పెడుతున్నారు. రెస్టారెంట్స్‌, హోటల్స్ కూడా వెళ్లి నాన్ వెజ్ తింటూ వీడియోలు కూడా చేస్తున్నారు. సందర్భం ఏదైనా చికెన్ లేదా మటన్ బిర్యానీ ఉండాల్సిందే. చిన్న చిన్న పార్టీల్లో కూడా ముక్కలు ఉండాల్సిందే. కానీ అసలు నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండగలరా.. కేవలం కార్తీక మాసంలోనే నెల రోజులు ఎంతో కష్టంగా తినకుండా ఉంటారు. ఆ తర్వాత కుమ్ముడే కుమ్ముడు. నాన్ వెజ్ హోటల్స్, రెస్టారెంట్లు అస్సలు ఖాళీ ఉండవు. చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్ ఇలా వారికి నచ్చింది వేసేస్తూ ఉంటారు. అయితే మన దేశంలోనే నాన్ వెజ్ తినకుండా ఉన్న ఓ సిటీ ఉంది. అక్కడ నాన్ వెజ్ అస్సలు తినరు. తింటే కఠిన శిక్షలు అమలు పరుస్తారు. ఇంతకీ ఆ నగరం ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం.

ఎక్కడంటే..

గుజరాత్‌లోని భావ్ నగర్‌ జిల్లాకు చెందిన పాలితానా అనే నగరంలో నాన్ వెజ్ తినడం బ్యాన్. ప్రపంచంలోనే మాంసాహారాన్ని నిషేధించిన మొదటి నగరంగా ఈ ప్రాంతం పేరు తెచ్చుకుంది. ఇక్కడ నాన్ వెజ్ తినడం మహా పాపం. నేరంగా పరిగణిస్తారు. జంతువులను ఇక్కడ ఎట్టి పరిస్థితిల్లో కూడా చంపరు. మాంసం అమ్మడం కూడా చట్ట విరుద్ధంగా మారింది.

ఎందుకంటే..

మొదటి సారిగా 2014లో రాజ్ కోట్ నగరంలో మాంసం తినడం, అమ్మడాన్ని నిషేధంగా ఓ ఆదేశం జారీ చేశారు. ఈ విధానాన్ని రాజ్ కోట్ నగరం తర్వాత వడోదర, జునాగఢ్, అహ్మదాబాద్ నగరాలు కూడా అనుసరించాయి. మాంసాన్ని బ్యాన్ చేయాలని దాదాపు 200 మందికి పైగా జైన సన్యాసుల నిరసన వ్యక్తం చేశారు. ఈ నగరంలో ఎక్కువగా జైన సన్యాసులు ఉంటారు. వారి నిరసన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జైనులకు సంబంధించి అనేక మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మాంసాహారం తినడం వల్ల అనేక చెడు అలవాట్లు కలుగుతాయని వీరి నమ్మకం.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే అక్కడ పాలితానా నగరంలో శాఖాహార హోటల్స్ పుట్టుకొచ్చాయి. నోరూరించే వంటలతో ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ దృష్టిని కూడా ఈ నగరం ఆకర్షించింది. అనేక మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తున్నారు. అహింస అనేది ఈ నగర ముఖ్య ధ్యేయం.

Viral

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.