AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడు సార్లు చావును జయించిన మృత్యుంజయుడు ‘ఫ్రానే సెలాక్’

ఏడు సార్లు చావును జయించి ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. ఫ్రానే సెలాక్ అనే ఈ వ్యక్తి జీవితం ‘ఫైనల్ డెస్టినేషన్’ అనే మూవీని తలపిస్తుంది. అతడు ఎంత లక్కీ ఫెలో అంటే.. ఏడు గండాల తర్వాత అతడిని మరో లక్ వరించింది. క్రొయేషియా దేశానికి చెందిన మ్యూజిక్ టీచర్ ఫ్రానే సెలాక్ 1929లో జన్మించాడు. అతను పుట్టింది పేద కుటుంబంలో కావడంతో తాను చాలా దురదృష్టవంతుడని ఫీలయ్యేవాడు. కానీ, అతని జీవితంలో జరిగిన సంఘటనలు […]

ఏడు సార్లు చావును జయించిన మృత్యుంజయుడు 'ఫ్రానే సెలాక్'
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 15, 2019 | 4:24 PM

Share

ఏడు సార్లు చావును జయించి ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. ఫ్రానే సెలాక్ అనే ఈ వ్యక్తి జీవితం ‘ఫైనల్ డెస్టినేషన్’ అనే మూవీని తలపిస్తుంది. అతడు ఎంత లక్కీ ఫెలో అంటే.. ఏడు గండాల తర్వాత అతడిని మరో లక్ వరించింది.

క్రొయేషియా దేశానికి చెందిన మ్యూజిక్ టీచర్ ఫ్రానే సెలాక్ 1929లో జన్మించాడు. అతను పుట్టింది పేద కుటుంబంలో కావడంతో తాను చాలా దురదృష్టవంతుడని ఫీలయ్యేవాడు. కానీ, అతని జీవితంలో జరిగిన సంఘటనలు అతడిలోని ఆ ఆలోచనను దూరం చేశాయి. కారణం.. ఈ ప్రమాదాలే!

  • 1962 – రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది చనిపోగా ఫ్రానే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో అతని చేయి విరిగింది.
  • 1963 – ఫ్రానే ప్రయాణిస్తున్న విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో విమానం వెనుక డోరు ఊడిపోవడంతో కూలడానికి ముందే ఫ్రానే బయటకు ఎగిరిపోయి గడ్డివాముపై పడ్డాడు. ఫలితం.. మీకు తెలిసిందే.
  • 1966 – బస్సు బోల్తాపడిన ఘటనలో నలుగురు చనిపోయారు. ఫ్రానే మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
  • 1970 – ఫ్రానే ప్రయాణిస్తున్న కారు మంటల్లో చిక్కుకుంది. దీంతో ఫ్రానే వెంటనే కారు నుంచి బయటకు వచ్చి దూరంగా పరిగెట్టాడు. కొద్ది క్షణాల తర్వాత ఆ కారు భారీ విస్ఫోటనంతో పూర్తిగా కాలిపోయింది.
  • 1973 – ఈ సారి అతను ప్రయాణిస్తున్న కారు మంటల్లో చిక్కుకుంది. ఎప్పటిలాగానే అతడు తప్పించుకున్నాడు.
  • 1995 – రోడ్డు దాటుతున్న ఫ్రానేను బస్సు ఢీకొట్టింది. కానీ, అతను ప్రాణాలకు ఏమీ కాలేదు.
  • 1996 – అతడు ప్రయాణిస్తున్న కారు 300 అడుగుల లోయలో పడిపోయింది. అయితే, ప్రమాదానికి ముందే అతడు కారు నుంచి బయటకు దూకి చెట్టును పట్టుకుని వేలాడి ప్రాణాలు దక్కించుకున్నాడు.
  • 2003 -ఈ సారి అతడి జీవితంలో ఊహించని ట్విస్ట్.. లక్ష్మీ దేవి వరించడం. ప్రాణ గండాల తర్వాత ఆయన 10 మిలియన్ డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.6,94,79,000) లాటరీ గెలుచుకున్నాడు.
  • 2010 – ఆ డబ్బుతో అతను రెండు బంగ్లాలు కొన్నాడు. ఐదో పెళ్లి చేసుకున్నాడు. తాను జీవించడానికి సరిపడా సొమ్మును దాచుకుని, మిగతాది తన కుటుంబికులు, స్నేహితులకు పంచేశాడు.                                                                                                            అతను తన కుటుంబానికి మరియు స్నేహితులకు తన సంపదను పంచేశాడు. తన ఆరోగ్యం మరియు భార్య కాతరినాయే తన‌ సంతోషం అని సెలాక్ విన్నవించారు. ఏడు సార్లు చావును జయించిన సెలాక్ ఇలా “ఇంతకుముందు అన్ని వివాహాలు కూడా వైపరీత్యాలుగా ఉన్నాయి” అని చమత్కరించారు.

Follow Us